నెల్లూరు జిల్లా కొవ్వూరు మండలంలో స్టౌబిడి కాలనీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ కొనడంతో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో, చికిత్స నిమిత్తం 108 సహాయంతో నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: cylinder blast : గ్యాస్ సిలిండర్ పేలి...ఇద్దరికి తీవ్ర గాయాలు