చిత్తూరు జిల్లా పలమనేరు మండలం టి.వడ్డూరు గ్రామానికి చెందిన యోగేశ్ అనే యువకుడు పెంగరగుంట సమీపంలోని అటవీప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరికొన్ని రోజుల్లో యోగేశ్‌కు వివాహం జరగాల్సి ఉంది. ఇంటికి రంగులు వేసే విషయమై పినతల్లి, అతనికి మధ్య మూడు రోజుల క్రితం గొడవైంది. మనస్థాపానికి గురై ఆ రోజే ఇంటి నుంచి వెళ్లిపోయిన యోగేశ్... సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆదివారం శవమై కనిపించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
త్వరలో వివాహం... అంతలోనే విషాదం - ap crime news
మరికొన్ని రోజుల్లో ఆ యువకుడి వివాహం జరగాల్సి ఉంది. కుటుంబసభ్యులు అందరూ పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇంటికి పెయింటింగ్ వేసే విషయంలో పినతల్లితో జరిగిన గొడవతో అతను ఇంటి నుంచి వెళ్లిపోయాడు. సమీపంలోని అటవీ ప్రాంతంలో శవమై కనిపించాడు.

ఇదీ చదవండి