చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని పూతలపట్టు - నాయుడుపేట జాతీయ రహదారిపై తొండవాడ వద్ద టిప్పర్ అదుపు తప్పి గోతిలో పడింది. అదృష్టవశాత్తు డ్రైవర్ ప్రాణాలతో బయటపడ్డాడు. చంద్రగిరి నుంచి మెటల్ లోడుతో తిరుపతి వైపు వెళ్తున్న వాహనం తొండవాడ వద్ద అదుపు తప్పింది. ఆర్చి కోసం తీసిన గోతిలో పడింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. టిప్పర్ క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు.
ప్రమాదానికి గురైన వాహనం కెఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కు చెందినదిగా గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పూతలపట్టు - నాయుడుపేట మధ్య 6 వరసల రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. సరైన భద్రతా చర్యలు తీసుకోని కారణంగానే.. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇదీ చదవండి:
పర్యటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టండి: మంత్రి అవంతి