ETV Bharat / state

పిల్లలు దివ్యాంగులని రెండో పెళ్లి చేసుకున్నాడు.. అంతలోనే మరో ట్విస్ట్! - నీరుగుంటవారి పల్లిలో భర్త ఇంటి ముందు రెండో భార్య నిరసన

పిల్లలు దివ్యాంగులుగా పుట్టారని.. మరో యువతిని రెండో వివాహం చేసుకున్నాడు ఓ ప్రబుద్ధుడు. అయితే ఆమెకూ నయంకాని వ్యాధి ఉందని.. వదిలించుకోవాలనుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని.. అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకొలేనని సాకులు చెబుతున్నాడు.

Second wife protest in front of husbands house
భర్త ఇంటి ముందు రెండో భార్య నిరసన
author img

By

Published : Jul 23, 2021, 7:30 PM IST

Updated : Jul 23, 2021, 9:44 PM IST

భర్త ఇంటి ముందు రెండో భార్య నిరసన

చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం నీరుగుంటవారిపల్లిలో రెండో భార్య.. తన భర్త ఇంటి ముందు నిరసన చేపట్టింది. తమిళనాడు రాష్ట్రం మధురైకి చెందిన అన్బురాజన్ 30 సంవత్సరాల క్రితం మదనపల్లికి వచ్చాడు. నీరుగట్టువారి పల్లిలో మిఠాయిల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇతనికి మొదటి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పిల్లలు వికలాంగులు కావడంతో అన్బురాజన్... నీరుగట్టువారిపల్లెకు చెందిన యువతని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈమె నయంకాని వ్యాధితో బాధపడుతుందని తెలిసి.. వదిలించుకోవాలని ప్రయత్నించాడు. ఈ కారణంగా రెండో భార్య తల్లిదండ్రులు.. అన్బురాజన్ ఇంటి వద్ద నిరసన చేపట్టారు. ప్రస్తుతం తాను ఇబ్బందుల్లో ఉన్నానని అనారోగ్యంతో ఉన్న రెండో భార్యను చూసుకునే ఆర్థిక స్తోమత లేదనటంతో బాధితులు అతనిపై గొడవకు దిగారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండీ.. సొంత వారికి పంచభక్ష పరమాన్నం.. వాళ్లకేమో గంజినీళ్లు : బీదా రవి

Last Updated : Jul 23, 2021, 9:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.