కడప జిల్లా రాజంపేటలో బైపాస్ రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా... మహిళ తీవ్రంగా గాయపడ్డారు. పుల్లంపేట మండలం వేల్పులవారిపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వర రాజు, శ్యామలమ్మ అనే మహిళతో ద్విచక్ర వాహనంపై బోయనపల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో వెనకనుంచి వచ్చిన ఐచర్ వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేశ్వరరాజు అక్కడికక్కడే మృతి చెందగా.. గాయపడిన శ్యామలమ్మను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడనుంచి కడపకు తరలించారు. సమాచారం తెలుసుకున్న మన్నూరు పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: