ETV Bharat / state

విద్యార్థినిని నమ్మించి బలవంతపు పెళ్లి చేసుకున్న లెక్చరర్ అరెస్టు.. ఎక్కడంటే? - lecturer forcibly married a student

lecturer forcibly married a student: ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి, బలవంతంగా పెళ్లి చేసుకున్న ఓ లెక్చరర్‌పై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటికే ఆ లెక్చరర్‌కు పెళ్లయి, ఓ కుమార్తె కూడా ఉంది. గతకొంత కాలంగా ఆ విద్యార్థినితో చనువుగా ఉంటూ, మాయమాటలతో చెప్తూ రోజులు గడిపిన అధ్యాపకుడు.. ఆ విద్యార్థినిని నమ్మించి తిరుపతికి తీసుకెళ్లి, బలవంతపు పెళ్లి చేసుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులు విస్తుపోయే వివరాలను వెల్లడించారు.

lecturer
lecturer
author img

By

Published : Apr 1, 2023, 5:12 PM IST

Updated : Apr 1, 2023, 5:28 PM IST

lecturer forcibly married a student: చదువుకునేందుకు కళాశాలకు వచ్చిన పిల్లలకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ గురువు.. తప్పుడు మార్గం పట్టాడు. అప్పటికే తనకు పెళ్లాయి, ఓ కుమార్తె కూడా ఉన్నప్పటికీ కామ ఆలోచనలతో.. తాను నిజాయితీపరుడనని, తనను నమ్మితే జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని ఓ విద్యార్థినికి మాయమాటలు చెప్పి, బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. పరీక్ష రాసి బయటకు వస్తున్న ఆ విద్యార్థినికి ఇష్టంలేకపోయిన తిరుపతికి తీసుకెళ్లి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైనా కొద్దిసేపటికి ఆ అధ్యాపకుడి నిజస్వరూపాన్ని పసిగట్టిన బాలిక.. జరిగినదంతా తల్లిదండ్రులకు తెలియజేసింది. అప్రమత్తమైన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ అధ్యాపకుడి అసలు బాగోతం బయటపడింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా గంగవరం మండలానికి చెందిన చలపతి (33) అనే వ్యక్తి గతకొన్ని సంవత్సరాలగా శ్రీ వాణి జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వర్తీస్తున్నాడు. ఈ క్రమంలో అదే కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థినితో (బాలిక) చనువుగా ఉండటం ప్రారంభించాడు. ఈ నేపథ్యంలో రోజు రోజు ఆ విద్యార్థినికి మాయమాటలు చెప్తూ రోజులు గడిపాడు.

ఈ క్రమంలో తాజాగా ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షను రాసి బయటకు వస్తున్న ఆ విద్యార్థినిని నమ్మించి తిరుపతికి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత తాను నిజాయితీగా ఉండే వ్యక్తినని, తనను నమ్మి పెళ్లి చేసుకుంటే సంతోషంగా చూసుకుంటానని పలు రకాల హామీలతో ఆ బాలికను నమ్మించాడు. అనంతరం అక్కడే ఓ ఆలయంలో ఆ బాలిక మెడలో తాళికట్టి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన కొద్దిసేపటికి లెక్చరర్ చలపతి నిజస్వరూపాన్ని ఆమె గమనించింది. అతడు చెప్తున్న మాటలకు పొంతన లేకపోవడంతో తనను మోసం చేశాడని గ్రహించి బోరున కన్నీరుమున్నీరయ్యింది.

అనంతరం జరిగిన విషయాన్నంతా తన తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే బాలిక, ఆమె తల్లిదండ్రులు గురువారం రాత్రి గంగవరం పోలిస్ స్టేషన్‌కు చేరుకోని.. లెక్చరర్ మాయమాటలు చెప్పి తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదును స్వీకరించినా.. ఎస్ఐ సుధాకర్ రెడ్డి ఫోక్సో చట్టం కింద ఆ కీచక అధ్యాపకుడిపై కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలించిన పోలీసులు.. అతన్ని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచారు. నిందితుడికి అంతకుముందే పెళ్లయి, ఒక బిడ్డ కూడా ఉందని ఎస్ఐ సుధాకర్ రెడ్డి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ''గంగవరం మండలానికి చెందిన మైనర్ బాలిక (17 ఏళ్లు)ను ఇదే గంగవరం మండలానికి చెందిన చలపతి (33) అనే వ్యక్తి మాయమాటలు చెప్పి బలవంతపు పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతడికి పెళ్లయి, ఓ కుమార్తె కూడా ఉంది. బాలిక ఫిర్యాదుతో అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్టు చేసి, కోర్టులో హాజరుపరిచాము'' అని అన్నారు.

ఇవీ చదవండి

Last Updated : Apr 1, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.