చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న ఉలవలను తీసుకునేందుకు రైతులు క్యూ కడుతున్నారు. ఉలవలను తీసుకునేందుకు ముందుగా పర్మిట్లు తీసుకోవాల్సి ఉంది.. అందువల్లనే ఉదయాన్నే వచ్చి వరుసక్రమంలో నిలబడుతున్నారు . ఈ పర్మిట్ల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పెద్ద సంఖ్యలో రైతులు తరలి వస్తుండంతో పోలీసులు సైతం తోపులాట లేకుండా బారికేడ్లను ఏర్పాటు చేశారు. పీలేరు నియోజకవర్గంలోని కలికిరి, వాల్మీకిపురం , గుర్రంకొండ, కె.వి పల్లి, పీలేరు, కలకడ మండలాల్లో ఒక్క రైతుకు పది కిలోల చొప్పున సుమారు 2వేల క్వింటాళ్ల వరకు రైతులకు పంపిణీ చేశారు. సకాలంలో వర్షాలు రాక పొలాలను బీడులు పెట్టుకున్న రైతులు ఉలవలను సాగు చేస్తున్నారు .ఉలవపొట్టు పశువులకు మేతగా .. ఉలవలు దాణాగా ఉపయోగపడతాయి. కావున ఉలవ పంటకు ప్రాధాన్యత సంతరించుకుంది. జిల్లాలోని రైతులు వేరుశనగ పంటకు ప్రత్యామ్నాయంగా అధిక విస్తీర్ణంలో ఉలవను సాగు చేస్తున్నారు.
ఇదీచూడండి.గ్రూప్-2 మెయిన్స్ పరీక్షకు సర్వం సిద్ధం