చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం పెరుమాళ్లపల్లెలో దీపావళి సందర్భంగా టపాకాయలు కాల్చుతుండగా నిప్పురవ్వలు పడి పూరిల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన కొందరు చిన్నారులు టపాసులు కాల్చుతున్నారు. ఈ క్రమంలో నిప్పురవ్వలు ఎగసి పడి మార్కొండారెడ్డికి చెందిన గుడిసెపై పడ్డాయి. ఇంటి నుంచి పొగ రావడాన్ని గుర్తించిన పిల్లలు కేకలు వేయడంతో గ్రామస్థులు అప్రమత్తమయ్యారు. ఆలోపే మంటలు భారీగా ఎగిసిపడటం వల్ల అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపు యువకులు మంటలను అదుపు చేశారు.
ఇదీ చూడండి: