తిరుమలలో పెళ్లి చేసుకోవాలని కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నుంచి ఓ జంట తిరుపతికి చేరుకుంది. కరోనా ప్రభావంతో తిరుమలకు అనుమతి నిలిపివేశారు. ఫలితంగా ఆ జంట అలిపిరిలోనే వివాహం చేసుకోవాల్సి వచ్చింది. తిరుమలలోనే పెళ్లి చేసుకుందామనుకున్నవారిని ఒప్పించి... తిరుపతి డీఎస్పీ నాగసుబ్బన్న పెళ్లి చేశారు. గరుత్మంతుని సాక్షిగా నడిరోడ్డుపై వారికి విహహం జరిపించారు. చుట్టుపక్కల వారు... ఆ నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఇదీచూడండి. శ్రీకాళహస్తి ఆలయంలో ఉచితంగా ప్రసాదం పంపిణీ