ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో రెండో విడత పోలింగ్​ ప్రశాంతం

చిత్తూరు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సజావుగా ముగిసింది. పోలింగ్ సమయం పూర్తయ్యే సరికి జిల్లాలో 77.20 శాతం నమోదైంది. అత్యధికంగా రామసముద్రం మండలంలో పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా పీలేరు మండలంలో పోలింగ్ శాతం నమోదైంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీలో రేగిన వివాదం తప్ప పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.

చిత్తూరు జిల్లాలో రెండో విడత పోలింగ్​ ప్రశాంతం..

author img

By

Published : Feb 13, 2021, 8:00 PM IST

చిత్తూరు జిల్లాలో మొత్తం 17 మండలాల్లో.. 215 పంచాయతీలకు నిర్వహించిన ఎన్నికల రెండో విడత ప్రక్రియ ప్రశాంతంగా పూర్తైంది. మొత్తం 1771 పోలింగ్ కేంద్రాల్లో.. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరారు. చంద్రగిరి నియోజకవర్గంలోని యర్రావారిపాలెం, చిన్నగొట్టిగల్లు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా సాగింది. మదనపల్లె ప్రాంతంలో చలితీవ్రత ఎక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం ఓటర్లు మందకొడిగా కనిపించారు. జిల్లావ్యాప్తంగా పోలింగ్ ముగిసే సమయానికి 77.20 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యధికంగా రామసముద్రం మండలంలో 83.52 పోలింగ్ నమోదు కాగా..అత్యల్పంగా పీలేరు మండలంలో 64.83 పోలింగ్ శాతం నమోదైంది.

ఎన్నికల నిర్వహణ కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఆంక్షలను విధిస్తూ బయటివారిని లోనికి రానీయకుండా అడ్డుకున్నారు. కర్ణాటక-ఆంధ్రా సరిహద్దు ప్రాంతం మదనపల్లె మండలం చీకలబైలు చెక్​పోస్టు వద్ద ఎస్ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక నుంచి అక్రమ మార్గాల్లో మద్యం, నగదు వచ్చేందుకు అవకాశం ఉండటంతో అటు నుంచి వచ్చే వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేశారు. మదనపల్లె మండలం వలసపల్లె పంచాయతీలో 102 ఏళ్ల శతాధిక వృద్ధురాలు గంగులమ్మ, 80ఏళ్ల తన కుమారుడు వెంకటరమణ, కోడలు గిరిజమ్మతో కలిసి ఓటేసేందుకు రావటం పలువురికి ఆదర్శంగా నిలిచింది.

తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లి వద్ద ఎన్నికల విధుల్లో ఉన్న గ్రామ రెవెన్యూ సహాయకుడు నరసింహులు ఎన్నికల విధుల్లో ఉండగా ఫిట్స్ రావటంతో సొమ్మసిల్లి పడిపోయాడు. వీఆర్ఏను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా మార్గమధ్యంలోనే కన్నుమూయటం స్థానికంగా విషాదాన్ని నింపింది. మదనపల్లె నియోజకవర్గం రామసముద్రంలో పంచాయతీ ఎన్నికల్లో పాల్గొని ఓటేసి బయటకు వచ్చిన 65ఏళ్ల గంగులప్ప.. పోలింగ్ కేంద్రానికి సమీపంలో సొమ్మసిల్లి పడిపోయాడు. వృద్ధుణ్ని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించినా మార్గమధ్యంలోనే కన్నుమూశాడు.

ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యాక.. కౌంటింగ్ సమయంలో మదనపల్లె మండలం కోళ్లబైలులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోళ్లబైలు పంచాయతీలో నిర్వహించిన పోలింగ్ బ్యాలెట్ బాక్స్​లను పక్కనున్న బయ్యారెడ్డి కాలనీలో కౌంటింగ్ కేంద్రానికి తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ సమస్యలు, అంతర్జాలం పనిచేయకపోవటం వంటి కారణాలతో బ్యాలెట్ బాక్స్​లను పక్క గ్రామానికి తరలించేందుకు ప్రయత్నించినా.. గ్రామస్థులు అడ్డుపడ్డారు. పేపర్ కౌంటింగ్​కి అంతర్జాలంతో పనేంటంటూ ప్రశ్నించిన గ్రామస్థులు.. రోడ్డుపై అడ్డంగా బైఠాయించి కౌంటింగ్​ను తమ గ్రామంలోనే జరపాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.

ఇదీ చదవండి: మంత్రి కొడాలి నానిపై కేసు నమోదుకు ఎస్‌ఈసీ ఆదేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.