ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష - 6 years girl rape and murder case verdict came to hang the culprit
చిత్తూరు జిల్లాలో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో నిందితుడికి మరణశిక్ష విధిస్తూ జిల్లా అదనపు కోర్టు తీర్పు ఇచ్చింది. కురబలకోట మండలం అంగళ్లులో గతేడాది నవంబరు 7న ఘటన జరిగింది. దీనిపై విచారించిన పోలీసులు మదనపల్లె మండలం బసినికొండకు చెందిన మహమ్మద్ రఫీని అరెస్ట్ చేసి.. అతనిపై పోక్సో, హత్య కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 47 మందిని విచారించిన న్యాయస్థానం మృగాడికి మరణ దండన విధించింది.
ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో నిందితుడికి ఉరిశిక్ష
ఇదీ చూడండి: