కరోనాను నియంత్రించడం గ్రామీణ ప్రాంతాలలోని ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లకు సాధ్యమవుతుందని సీహెచ్ఓ వరలక్ష్మి తెలిపారు. చిత్తూరు జిల్లాలోని అన్ని గ్రామీణ ప్రాంతాలలో ఐదో విడత కరోనా సర్వేను సమగ్రంగా నిర్వహించాలని కిందిస్థాయి సిబ్బందికి సూచించారు. సర్వేను తూతూమంత్రంగా కాకుండా ఖచ్చితంగా ఇంటింటి వెళ్లి నిర్వహించి నివేదికను సమర్పించాలని ఆమె కోరారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమస్యలపై ఆరా తీయాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఒక రోజుకి 25 మందిని సర్వే చేయాలని ఆమె సూచించారు.
ఇదీ చూడండి