బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్రహీత కిదాంబి శ్రీకాంత్‌కు చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని ఐటీ పార్కు వద్ద 5.5 ఎకరాల ప్రభుత్వ భూమి అప్పగించారు. బ్యాడ్మింటన్ అకాడమీ కోసం శ్రీకాంత్ అభ్యర్థన మేరకు.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఈ భూమి కేటాయించారు. సంబంధిత పత్రాలను జిల్లా క్రీడల అధికారి మురళీకృష్ణ, రేణిగుంట డీటీ ప్రేమ్ శనివారం అందజేశారు. త్వరలో ఇక్కడ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు శ్రీకాంత్ తెలిపారు.
ఇదీ చదవండి: