చిత్తూరు జిల్లా తిరుపతిలో 200 మంది కరోనా బాధితులు శ్రీపద్మావతి జిల్లా కొవిడ్-19 ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వారికి ప్రభుత్వ విప్, తుడా చైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బాధితులకు డిశ్చార్జి పత్రాలను అందజేశారు. బాధితులు శ్రీ పద్మావతి కొవిడ్ ఆసుపత్రిలో అందుతున్న సేవల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఒకసారి వైద్య సేవలు పొంది నెగిటివ్ వచ్చిన తరువాత తిరిగి పాజిటివ్ వచ్చే అవకాశం లేదని ఎమ్మెల్యే చెవిరెడ్డి చెప్పారు.
ఇక్కడనుంచి ఇంటికి వెళ్ళిన తరువాత మరో వారం రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సూచించారు. ఆ తరువాత యధావిధిగా తమ పనులు చేసుకోవచ్చని తెలిపారు. కరోనా భయం అవసరం లేదన్నారు. అలా భయపడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవుపలికారు. బాధితులతో ఆప్యాయంగా మాట్లాడి వారిలో మనోధైర్యాన్ని నింపారు. అనంతరం బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ. 2 వేల నగదును అందజేశారు.
ఇదీ చదవండి తిరుమల ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహనదారులపై చిరుత దాడి