ETV Bharat / state

Deadbodies found: స్వర్ణముఖి నదిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం

చిత్తూరు జిల్లాలో ఆదివారం రోజు గల్లంతైన ఇద్దరి మృతదేహాలు గుడిమల్లం వద్ద నేడు లభ్యమయ్యాయి. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు గల్లంతు కాగా.. అదేరోజు ఒకరి మృతదేహం దొరికింది. మరో ఇద్దరి మృతదేహాలు నేడు లభ్యమయ్యాయి.

author img

By

Published : Dec 21, 2021, 11:55 AM IST

2 DEAD BODIES FOUND IN SWARNAMUKHI RIVER
స్వర్ణముఖి నదిలో గల్లంతైన ఇద్దరి మృతదేహాలు లభ్యం

చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జి.పాలెం సమీపంలో స్వర్ణముఖి వాగులో ఈతకు వెళ్లి గల్లంతైన వారిలో గుడిమల్లం వద్ద ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. దొరికిన మృతదేహాలు ధోని, యుగంధర్​లవిగా పోలీసులు గుర్తించారు. జి.పాలెం ఎస్సీ కాలనీకి చెందిన ధోని(16), గణేష్(15), యుగంధర్(14)లు ఆదివారం రోజు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకుని గాలింపు చేపట్టగా జయ గణేష్ మృతదేహం లభ్యమైంది. మరో ఇద్దరి మృతదేహాలు కోసం మొన్నటి నుంచి ఈ రోజు వరకు రేణిగుంట పోలీసులు, రెస్క్యూ టీంలు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు ఈరోజు మృతదేహాలు లభ్యమయ్యాయి.

సంబంధిత కథనాలు:

Students missed in Swarnamukhi: స్వర్ణముఖి వాగులో ఈతకు వెళ్లి.. ముగ్గురు విద్యార్థులు గల్లంతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.