ETV Bharat / state

Arrest: బాలుడిపై లైంగిక వేధింపులు, హత్య.. నిందితుడు అరెస్టు

చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె మండల పరిధిలోని ఓ గ్రామంలో అనుమానస్పద స్థితిలో హత్యకు గురైన బాలుడి (8) కేసును పోలీసులు చేధించారు. అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకుడు లైంగిక వేధింపులకు గురిచేసి బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

boy's death case in chittore district
boy's death case in chittore district
author img

By

Published : Oct 25, 2021, 6:24 PM IST

ఈనెల 12న చిత్తూరు జిల్లా కంభంవారిపల్లె మండల పరిధిలోని ఓ గ్రామంలో అనుమానస్పద స్థితిలో హత్యకు గురైన బాలుడి (8) కేసును పోలీసులు చేధించారు. అదే గ్రామానికి చెందిన 17 ఏళ్ల యువకుడు లైంగిక వేధింపులకు గురిచేసి బాలుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బాలుడి తల్లిదండ్రులు విదేశాల్లో ఉంటూ బంధువుల ఇంట్లో తమ కుమారుడిని ఉంచి చదివిస్తున్నారు. ఈ క్రమంలో దసరా పండగ వేళ ఆనందగా గడిపేందుకు కంభంవారిపల్లె మండల పరిధిలోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లాడు. స్నేహితులతో ఆడుకుంటానని అమ్మమ్మకు చెప్పి ఈనెల 11న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. కానీ.. ఎంతసేపటికీ ఇంటికి రాలేదు. కుటుంబసభ్యులు చుట్టుపక్కలంతా వెతికినప్పటికీ..ఫలితం లేకపోయింది. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు..బాలుడి కోసం గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో.. ఈనెల 12 మధ్యాహ్నం గ్రామానికి సమీపంలోని ఓ బొప్పాయి తోటలో బాలుడు మృతిచెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలుడి మృతికి గ్రామానికి చెందిన యువకుడు కారణమని.., లైగింకంగా వేధించి చిన్నారిని హతమార్చినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి

brother attack: అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చింది !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.