చిత్తూరు జిల్లా పాకాల మండలం దామలచెరువు పదో తరగతి విద్యార్థులు... కష్టాల్లో ఉన్న స్నేహితుని కుటుంబానికి 3 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు. వాళ్ల స్నేహితుడు గణేష్, అతని తండ్రి ఇటీవల కరోనాతో మృతి చెందారు. దీంతో కలత చెందిన ఆ విద్యార్థులు... ఆ కుటుంబానికి ఏదైనా సాయం చేయాలని అనుకున్నారు. అందరూ కలిసి 3 లక్షల రూపాయలను సేకరించారు. ఒంటరిగా ఉంటున్న గణేష్ తల్లికి... పెద్దల ద్వారా ఆర్థిక సాయాన్ని అందించారు. విద్యార్థుల సేవాగుణాన్ని స్థానికులు అభినందించారు.
ఇదీ చదవండి