చిత్తూరు జిల్లా జీవీ పల్లి మండలం తిమ్మాపురంలో వైకాపా - తెదేపా నాయకుల మధ్య చెలరేగిన ఘర్షణ.. పరస్పర దాడికి దారి తీసింది. ఈ ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయి. వారిని పీలేరు ఆస్పత్రికి పోలీసులు తరలించారు.
రెండో విడత పల్లె పోరు ఫలితాల్లో తమ అభ్యర్థి విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేకే... వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారంటూ ప్రత్యర్థి వర్గం నేతలు ఆరోపించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: