ETV Bharat / state

సర్వం సిద్ధం... 21న "న్యాక్​"లో యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న విజయవాడ న్యాక్ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం జగన్​, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని హాజరుకానున్నారు.

author img

By

Published : Jun 19, 2019, 4:47 PM IST

యోగా దినోత్సవ వేడుకలు సిద్ధమవుతున్న విజయవాడ

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న విజయవాడ న్యాక్ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కృష్ణా కలెక్టర్​ ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ యోగా వేడుకలు జరగనున్నాయి. సీఎం వైఎస్ జగన్​మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వేడుకలకు హాజరవుతారు. ఆయుష్ కమిషనర్ పీఏ.శోభ, ఇతర అధికారులు న్యాక్​ కల్యాణ మండపాన్ని సందర్శించారు.

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈనెల 21న విజయవాడ న్యాక్ కల్యాణ మండపంలో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించనున్నట్లు కృష్ణా కలెక్టర్​ ఇంతియాజ్‌ అహ్మద్‌ తెలిపారు. ఉదయం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల వరకూ యోగా వేడుకలు జరగనున్నాయి. సీఎం వైఎస్ జగన్​మోహన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని వేడుకలకు హాజరవుతారు. ఆయుష్ కమిషనర్ పీఏ.శోభ, ఇతర అధికారులు న్యాక్​ కల్యాణ మండపాన్ని సందర్శించారు.


ఇదీ చదవండి... దిల్లీకి సీఎం జగన్.. జమిలి ఎన్నికలపై చర్చ!

Intro:కిట్ నం: 879,విశాఖ సిటీ, ఎం.డి.అబ్దుల్లా.

( )ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏ ఐ టి యు సి) జాతీయ కార్యవర్గ సమ్మేళనం జూలై 6, 7 ,8 తేదీలలో విశాఖలో నిర్వహించనున్నట్టు ఆ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు తెలిపారు. ఈ మేరకు విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. జాతీయ సమావేశాలు సందర్భంగా జులై 6వ తేదీన విశాఖలో 15 వేల మంది కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్టు వివరించారు.


Body:ఏఐటియుసి జాతీయ కార్యవర్గ సమ్మేళనంలో దేశంలోని ఉక్కు, బొగ్గు, సిమెంట్ తదితర రంగాలకు చెందిన జాతీయ కార్మిక నాయకులు పాల్గొంటారని ఓబులేసు తెలిపారు. ఇటీవల కేంద్రంలో అధికారంలోకి వచ్చిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 40 కార్మిక చట్టాలను కుదించేందుకు సమాయత్తమైందని , ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా కార్మికవర్గం ఎదుర్కొంటున్న సవాళ్లను పోరాటాల రూపంలోకి మార్చేందుకు తమ కార్యాచరణను కార్మికవర్గం రూపొందించుకుంటుంది తెలిపారు.


Conclusion:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడికల్ ,తదితర రంగాలకు చెందిన లక్షలాది కార్మికుల సంక్షేమం కోసం సలహా సంఘాలను ఏర్పాటు చేసి వారికి కనీస వేతనాలు అమలు చర్యలు తీసుకోవాలని కోరారు. మీడియా సమావేశంలో ఏ ఐ టి యు సి రాష్ట్ర కార్యదర్శి బీవీ కొండలరావు , బి సి హెచ్ మసేన్ తదితరులు పాల్గొన్నారు.

బైట్: జి.ఓబులేసు, కార్యదర్శి, ఎ.ఐ.టి.యు.సి. రాష్ట్ర సమితి.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.