ETV Bharat / state

'లింగమనేని ఐ.జే.ఎం టౌన్​షిప్​పై విచారించాలి' - Lingamaneni ventures

మంగళగిరిలోని ఐ.జే.ఎం టౌన్​షిప్​లో అక్రమ లేఔట్లు, వెంచర్లు వేశారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. తెదేపా హయాంలో లింగమనేని రమేష్​కు అక్రమంగా భూములు కట్టబెట్టారన్నారు.  ఐ.జే.ఎంలో నిర్మించిన టౌన్​షిప్​లకు సంబంధించి పంచాయతీలకు చెల్లించాల్సిన ఫీజులను చెల్లించలేదన్నారు. వీటిపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టాలని సీఎంను కోరుతానన్నారు.

లింగమనేని ఐ.జే.ఎం టౌన్​షిప్​పై విజిలెన్స్ దర్యాప్తు
author img

By

Published : Jul 6, 2019, 2:16 PM IST

కృష్ణా జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో లింగమనేని రమేష్​ సంస్థ నిర్మించిన ఐ.జే.ఎం టౌన్​షిప్​లో అక్రమంగా లేఔట్లు, వెంచర్లు వేశారని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి ఆరోపించారు. విజయవాడ వైకాపా రాష్ట్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన...నిబంధనలను పాటించకుండా, సుమారు 40 ఎకరాల్లో లే ఔట్లు వేశారని ఆరోపించారు. విలాసవంతమైన విల్లాలు కట్టి, ఒక్కో విల్లాను రూ.5 కోట్లకు అమ్ముకున్నారన్నారు. బిల్డింగ్ పర్మిట్, లే ఔట్ ఫీజులు కట్టకుండా వెంచర్లు వేశారన్నారు. కాజ గ్రామ పంచాయతీ రావాల్సిన సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయల ఫీజు ఎగవేశారని ఆళ్ల రామకృష్ణ రెడ్డి చెప్పారు.

పంచాయతీ చెల్లించాల్సిన ఫీజులు చెల్లించకుండా తిరిగి...వారిపైనే కేసులు వేశారన్నారు. తెదేపా హయాంలో జరిగిన భూ దందాలను ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లి విజిలెన్స్ దర్యాప్తు కోరుతామన్నారు. 2010లో లింగమనేని రమేష్ ఈ టౌన్​షిప్​లను ఐజేఎంకు అప్పగించినట్లు తెలిపారు. మంగళగిరి పరిసరాల్లో సుమారు 250 ఎకరాలు అక్రమంగా పొందారని ఆరోపించారు.

లింగమనేని ఐ.జే.ఎం టౌన్​షిప్​పై విజిలెన్స్ దర్యాప్తు

ఇదీ చదవండి : విజయవాడలో ట్రాఫిక్ కష్టాలపై ప్రభుత్వం దృష్టి

Intro:ap_atp_56_06_accident_one_dead_av_AP10099
Date:06-07-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారి కూడలి వద్ద ఆదోని నుండి బెంగళూరుకు వేళుతున్న ఆర్టీసి బస్సు ప్రమాదవశాత్తు ఆగిఉన్న లారిని డీకొంది. వివరాల్లోకేళితే శ
శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత ప్రమాదానికి గురయింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న అదనపు డ్రైవర్ మల్లికార్జున(53)అక్కడికక్కడే మృతి చెందగా బస్సులో ప్రయాణీస్తున్న కర్నులు జిల్లా కోసగి మండలం కందుకూరు కి చెందిన రాజ్ కుమార్ , పార్వతి ఆమే కుమార్తే దీప తీవ్రంగా గాయపడ్డారు. పెనుకొండ కు చెందిన పీటర్ గోపాల్ స్వల్పగాయాలయ్యాయి. ఆర్ .ఎస్.4 పోలీసులు క్షతగాత్రులను పెనుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళురుకు తరలించారు.

.Body:ap_atp_56_06_accident_one_dead_av_AP10099Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.