తితిదే వ్యవహారంలో వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆరోపించారు. బంగారం బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రక్రియ ఇవాల్టిది కాదని గుర్తుచేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద 17ఏప్రిల్ 2016న 1,311 కిలోలు డిపాజిట్ చేశారన్నారు. 3ఏళ్ల కాలవ్యవధి ముగియడంతో బంగారాన్ని వెనక్కి తీసుకోవాలని తితిదే ఫైనాన్సియల్ సబ్ కమిటి మార్చి 20న నిర్ణయం తీసుకుందన్నారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు నిరాధారమైనవన్నారు. 13 ఛార్జిషీట్లలో ఏ2 నిందితుడిగా ఉన్న అతడి నుంచి ఇంతకన్నా మంచి మాటలు వస్తాయని అనుకోవడం భ్రమే అన్నారు. . 16నెలలు జైల్లో ఉండివచ్చిన వ్యక్తికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి గురించి మాట్లాడే యోగ్యత, నైతికత లేవన్నారు. దేవుడి సొమ్ము దొంగిలించడం ఎంత అపచారమో, దేవుడిపై దుష్ప్రచారం చేయడం, భక్తులపై నిందలు వేయడం అంతకన్నా అపచారమని వ్యాఖ్యనించారు.
ఇదీ చదవండి