ప్రజలు హర్షించే చర్యలను పాలకులు తీసుకోవాలని మాజీ మంత్రి యనమల.. ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రజావేదిక కూలగొట్టాలన్న నిర్ణయంతో... ముఖ్యమంత్రి జగన్ తుగ్లక్‌ను గుర్తుకు తెచ్చారని మండిపడ్డారు. ఉన్న నిర్మాణాలను సక్రమంగా వినియోగించుకుని కొత్త నిర్మాణాలు చేపట్టాలని... ప్రభుత్వం ఉన్నది భవనాలు కూలగొట్టేందుకు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వేదికతోపాటు సచివాలయం భవనాలను కూడా కూల్చివేస్తారా? అని ప్రశ్నించారు. 70 శాతం పూర్తయిన పోలవరం నిర్మాణాలను కూడా కూల్చివేస్తారా? అంటూ నిలదీశారు. వచ్చిన అధికారాన్ని నిర్మాణానికి వినియోగించాలని.. విధ్వంసాలకు తెగబడితే రాష్ట్రానికి, ప్రజలకు కీడు చేసినవాళ్లు అవుతారని వ్యాఖ్యానించారు.
ప్రజావేదిక భవనం కూలగొట్టాలనుకోవడం తుగ్లక్ చర్య: యనమల
‘ప్రజా వేదిక’ అన్నివర్గాల ప్రజల వేదిక.. అందుకే తమ ప్రభుత్వం ఆ భవనాన్ని నిర్మించిందని మాజీ మంత్రి యనమల పేర్కొన్నారు. కొత్త భవనాలు నిర్మించడంపై దృష్టి పెట్టకుండా ఉన్న వాటిని తొలగించడం సరైంది కాదని హితవు పలికారు.