అరుణారాయ్
అవినీతి నిర్మూలనకు, ప్రభుత్వ పాలనలో పారదర్శకతకు ఎంతో పాటుపడ్డారు. 2005లో సమాచార హక్కు చట్టం రావడానికి ముఖ్య పాత్ర పోషించారు. కమ్యూనిటీ లీడర్‌షిప్‌నకు 2000లో రామన్‌మెగసెసే అవార్డు, ప్రభుత్వ పాలనలో లాల్ బహదూర్ శాస్త్రి పురస్కారం వచ్చింది. 2011లో ప్రపంచంలో 100 మంది ప్రతిభావంతమైన వ్యక్తుల్లో స్థానం సంపాదించారు.
మేధాపాట్కర్
నర్మాదా బచావో ఉద్యమం ప్రారంభించి గుజరాత్ ప్రజలను, నదులను కాపాడటానకి ఎంతో కృషి చేశారు. చిన్న వయసు నుంచే సామాజిక కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొనేవారు. టాటా సంస్థలో సోషల్ వర్క్‌లో ఎంఏ చేశారు. పీహెచ్డీ మధ్యలో వదిలేసి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ గిరిజనుల కోసం పోరాడారు.
ఇరోం షర్మిలా
మణిపూర్ ఉక్కుమహిళగా అందరికీ సుపరిచితురాలు. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ బలగాల ఉన్న ప్రత్యేక అధికారాలు తొలగించాలని 500 వారాలు నిరాహార దీక్ష చేశారు. ప్రపంచంలో దీర్ఘకాలిక నిరాహార దీక్ష చేసిన వారిగా గుర్తింపు పొందారు.
లక్ష్మీ అగర్వాల్
యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా ఎంతగానే కృషి చేస్తున్నారు. యాసిడ్ అమ్మకాలు నిలిపివేయాలని 27వేల సంతకాలు సేకరించి సుప్రీం కోర్టు సమర్పించారు. ఈమె పోరాటంతో యాసిడ్ అమ్మకాలు ఆపేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ధర్మాసనం ఆదేశించింది. 2014 మిషెల్ ఒబామా చేతుల మీదుగా అంతర్జాతీయ ధీర వనిత పురస్కారం అందుకున్నారు. అమ్మాయలలోని అంతర్ సౌందర్యాన్ని ప్రచారం చేయడానికి వివా, డివా ప్రచారకర్తగా వ్యవహరించారు.
షాహిన్ మిస్త్రీ
పేద పిల్లల చదువు కోసం ఆమె చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ముంబయి మురికివాడ పిల్లల కోసం 1989లో ఆకాంక్ష సంస్థ ఏర్పాటు చేసి ఉచిత విద్య అందించారు. ఆ తర్వాత టెక్ ఫర్ ఇండియా స్థాపించి దేశవ్యాప్తంగా 1700 మందికి విద్యనందించారు. 2002లో ప్రపంచ ఆర్థిక సదస్సు గ్లోబల్ లీడర్ ఫర్ టుమారో పురస్కారం అందుకున్నారు.
ఇంకా ఎంతో మంది మహిళా సమాజికవేత్తలు సమాజంలో మంచి కోసం ఎంతో పాటుపడ్డారు.. ఆ ధీర వనితలకు మహిళాదినోత్సవ వందనం
ఇవీ చదవండి