గౌతం సవాంగ్‌కు వైకాపా అధినేతతో పాటు పార్టీ పెద్దల మద్దతు ఉన్నందున.. డీజీపీగా ఆయనను ప్రకటించడానికి రంగం సిద్దమైంది. వైకాపా అధినేత దిల్లీ పర్యటన తర్వాత... ఏ క్షణంలోనైనా డీజీపీగా గౌతం సవాంగ్‌ను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అవుతాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి కోసం కూడా కొందరు సీనియర్ ఐపీఎస్‌లు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ ఎన్నికల్లో గెలవకముందు నుంచే ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో ఉన్న పీఎస్ఆర్ ఆంజనేయులు ఏపీ ఇంటెలిజెన్స్ బాస్‌గా వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు రాష్ట్ర సర్వీసుల్లో ఉన్న ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఏకంగా జగన్, విజయసాయిరెడ్డిలకే నేరుగా తమ అభిమతం తెలిపినందున పీఎస్ఆర్ ఆంజనేయులు రేసులో నుంచి తప్పుకున్నట్టేనని పోలీసు శాఖలో చర్చ నడుస్తోంది. పీఎస్ఆర్ ఆంజనేయులు కూడా లండన్‌లోని ఆయన కుమారుడు వద్ద కొద్ది నెలలపాటు ఉండే అవకాశాలున్నాయని కొందరు చెబుతున్నారు్. ఈ కారణాల వల్ల పీస్ఆర్ ఆంజనేయులు ఇంటెలిజెన్స్ చీఫ్ పదవి రేసులో దాదాపు లేనట్టేనని ప్రచారం జరుగుతోంది.
ఇద్దరిలో ఒకరు
రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రస్తుత ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న విశ్వజిత్లలో ఒకరు కాబోయే సీఎం జగన్‌కు తన మనసులో మాట చెప్పగా...మరొకరు వైకాపాలో నెంబర్ టూ అయిన విజయ సాయిరెడ్డిని కలసి తనకే ఇంటెలిజెన్స్ శాఖ పగ్గాలు అప్పజెప్పాలని కోరినట్లు చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో వీరిద్దరిలో ఒక్కరికి ఇంటెలిజెన్స్ పగ్గాలు అప్పజెప్పడానికి ముహూర్తం ఖరారైనట్లు సమాచారం.
ఏసీబీ డీజీ ఎవరంటే..
ప్రస్తుతం విజయవాడ సీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావును ఏసీబీ డీజీగా మార్చే అవకాశం ఉన్నట్లు తెలస్తోంది. ద్వారకా తిరుమలరావుకు డీజీగా ప్రమోషన్ వచ్చినందున అతన్ని ఏసీబీకి మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏసీబీ డీజీగా వ్యవహారిస్తోన్న ఏబీ వెంకటేశ్వరరావును బదీలి చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాలో చర్చ కొనసాగుతుంది.
నిఘా విభాగాధిపతి పదవి వరించేది ఎవరిని? - ycp
నూతన డీజీపీగా గౌతం సవాంగ్ నియామకం దాదాపు ఖరారైంది. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరనే విషయంపై పోలీసు వర్గాలో చర్చనడుస్తోంది. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న కుమార్ విశ్వజిత్‌తోపాటు గతంలో విజయవాడ సీపీలుగా పనిచేసిన పీఎస్ఆర్ ఆంజనేయులు, రాజేంద్రనాథ్‌రెడ్డి కూడా పదవికి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురిలో పోస్ట్ ఎవరికిస్తారనేది ఆసక్తి రేపుతోంది.