మండుటెండలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రేపటి నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తర కర్ణాటక నుంచి కోమోరిన్ వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఉత్తర కోస్తాంధ్రలో వచ్చే 3 రోజుల పాటు తేలిక నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉండగా.. రాయలసీమలో చిరుజల్లులు పడే అవకాశం ఉంది.
చల్లని కబురు.. రాష్ట్రానికి 3 రోజులు వర్ష సూచన - వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వచ్చే 3 రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.