రాష్ట్రంలో త్వరితగతిన రహదారులనునిర్మాణాలను పూర్తి చేస్తామని రాష్ట్ర రహదారుల శాఖ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో చోడవరం శాసన సభ్యులు కరణం ధర్మశ్రీ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రెవెన్యూ గ్రాంట్ ద్వారా రహదారులను సరైన విధంగా నిర్మిస్తామన్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో వాటి నిర్వహణకు 142 కోట్లు కేటాయించామన్నారు. ఎన్నికల నియామావళి అమలులో ఉన్నందున వాటి నిర్వహణ కొద్దిగా ఆలస్యమైందన్నారు.
ఇదీచదవండి