ఈవీఎం యంత్రాల పనితీరుపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతోన్నతరుణంలో ఈసీ కొత్తగా వీవీప్యాట్ యంత్రాలను ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టింది. వాటి లెక్కింపునకు ఈసీ మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. ఆయా మార్గదర్శకాల ప్రకారమే వీవీ ప్యాట్ స్లిప్పులను వెలికి తీసి అభ్యర్థులకు పోలైన ఓట్లను లెక్కిస్తారు.
మెుదట నియోజకవర్గానికి ఒక పోలింగ్ బూత్‌ను ఎంపిక చేసి..అక్కడ ఉపయోగించిన వీవీప్యాట్ యంత్రంలోని చీటీలను లెక్కించాలని భావించారు. ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెగ్మెంట్‌కు అయిదు పోలీంగ్ బూత్‌లను ఎంపిక చేసి లెక్కించాలని ఈసీ నిర్ణయించింది. అక్కడ వాడిన వీవీ ప్యాట్ యంత్రాల్లోని చీటీలను లెక్కించేందుకు యంత్రాంగం సిద్ధమవుతోంది.
లెక్కింపు ఇలా ..
- ఎంపిక చేసిన వీవీప్యాట్ యంత్రాల్లో ఉన్న చీటీలు, దానికి అనుసంధానమై ఉన్న బ్యాలెట్ యూనిట్లో ఉన్న ఓట్ల సంఖ్యతో సరిచూస్తారు.
- పోలింగ్ కేంద్రాల వారీ ఉన్న ఓట్లు, పోలైన ఓట్లు వంటి వివరాలతో రూపొందించిన ఫారం-17ఎ తో సరిపోల్చుతారు.
- అంతా సరిగ్గా ఉన్న తర్వాత వీవీప్యాట్ యంత్రాల్లోని స్లిప్పులను అభ్యర్థుల తరఫు ఏజెంట్ల సమక్షంలో వెలికి తీస్తారు.
- అలా బయటకు తీసిన చీటీలను ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల వారీగా వేరు చేస్తారు.
- తదుపరి 25 చొప్పున కట్టలు కట్టి లెక్కిస్తారు.
- అభ్యర్థుల వారిగా విడదీసి, లెక్కింపు పూర్తి చేయడానికి 2 గంటలకు పైగా పట్టే అవకాశం ఉంది.
- అయిదు యంత్రాల్లోని స్లిప్పులను మాత్రమే లెక్కించాల్సి ఉన్నందున సమాంతరంగా ఒకేసారి ప్రారంభిస్తారు.
- ఈవీఎం ఓట్లను లెక్కించే టేబుల్‌నే దీనికి వినియోగిస్తారు. చీటీలను మాత్రం ట్రేలో వేసి అభ్యర్థుల వారీగా వేరుచేయనున్నారు.
లాటరీ పద్ధతిలో..
అసెంబ్లీ నియోజకవర్గానికి అయిదు, లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో అయిదు చొప్పున వీవీప్యాట్లను లెక్కించాలి. నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాల నెంబర్లను చీటీలపై రాస్తారు. ఆయా చీటీలను ఒక డబ్బాలో వేసి..కలిపిన తర్వాత అయిదు నెంబర్లను లాటరీలా తీస్తారు. ఆ నెంబర్లున్న యంత్రాల్లోని స్లిప్పులను లెక్కిస్తారు. ఇదంతా అభ్యర్థులు, వారి ఏజెంట్లు సమక్షంలో రిటర్నింగ్ అధికారి నిర్వహిస్తారు.
సిబ్బందికి శిక్షణ
ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. మొత్తం 35 వీవీప్యాట్ మెషీన్లను లెక్కించాల్సివుంటుంది. లెక్కింపుపై సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు.మరోవైపు వీవీ ప్యాట్ స్లిప్పులను 50 శాతం అయినా లెక్కింపు చెయ్యాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.
వీవీప్యాట్ స్లిప్పులను ఎలా లెక్కిస్తారంటే? - slips
ఎన్నికల సెగ ఇంకా తగ్గలేదు. ఈవీఎం యంత్రాలపై రచ్చ జరుగుతూనే ఉంది. ఈవీఎంలు సరే..వాటిని ట్యాంపరింగ్ చేస్తున్నారంటూ...కొన్ని రాజకీయ పార్టీల ఆరోపణ. ఆరోపణల నేపథ్యంలో వీవీ ప్యాట్ యంత్రాలను ప్రవేశపెట్టింది ఈసీ. వాటిని లెక్కించాలంటూ...పార్టీలు పట్టుబడితే...ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్లో 5 వీవీప్యాట్లను లెక్కించాలంటూ సుప్రీం ఆదేశించింది. ఇంతకీ వీవీప్యాట్లను ఎలా లెక్కిస్తారు? ఎవరు లెక్కిస్తారు?