తెలుగుదేశం పార్టీలో నామినేషన్ వేసిన తిరుగుబాటు అభ్యర్థులు దాదాపు అందరూ వెనక్కి తగ్గారు.తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరులో నామపత్రాలు వేసిన సుభాష్ చంద్రబోస్... నిర్ణయాన్ని మార్చుకున్నారు. పార్టీ అధికారికంగా నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. చంద్రబాబు సూచన మేరకే నడుచుకుంటానని తెలిపారు.
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా రెబల్‌గా బరిలో దిగిన పార్టీ సీనియర్ నాయకుడు హనుమంతరాయచౌదరి మనసు మార్చుకున్నారు. నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. తెదేపా అభ్యర్థి గెలుపుకోసం కృషి చేస్తానని ప్రకటించారు.
గుంటూరు జిల్లా మాచర్ల తెదేపా రెబల్ అభ్యర్థి నేత చలమారెడ్డి ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు ఉపసంహరణ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. చంద్రబాబు తనకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని అందుకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
మంత్రి లోకేశ్ పోటీచేస్తున్న మంగళగిరి నియోజక వర్గంలో 41 మంది నామినేషన్లు దాఖలు చేయగా... 32 మంది అభ్యర్థులు తుది పోరుకు సిద్ధమయ్యారు.
విజయనగరం జిల్లా చీపురుపల్లి స్వతంత్ర అభ్యర్థి కుచ్చర్లపాటి త్రిమూర్తులురాజు పోటీ నుంచి తప్పుకున్నారు. తెదేపా అభ్యర్థి కిమిడి నాగార్జునకు మద్దతు ప్రకటించి..తెదేపా విజయానికి సహకరిస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి