'మీ భవిష్యత్తు - నా బాధ్యత' అంటూ మరోసారి ప్రజామోదం కోసం ఎన్నికల బరిలోకి దిగుతున్న తెలుగుదేశం పార్టీ.... ఎన్నికల ప్రణాళిక హామీ పత్రాన్ని విడుదల చేసింది. అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మేనిఫెస్టో పొందుపరిచింది. కిందటిసారి పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందడగు వేసిన తెలుగుదేశం... ఈసారి ఎన్నికలకు సరికొత్త అంశాలతో ఆకర్షించే ప్రయత్నం చేసింది.
రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేనిఫెస్టో కమిటీ... సుదీర్ఘ కసరత్తు అనంతరం ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసింది. దీనిలో రైతన్నలకు పెద్దపీట వేసింది. సాగునీటి రంగ అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు ప్రకటించింది. ఈసారి కొత్తగా యువజన ప్రణాళిక రూపొందించి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది.
కాపులకు 5 రిజర్వేషన్ల అమలు మొదలు....అగ్రవర్ణ పేదలకు విద్య, ఉద్యోగ రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు ఎన్నికల హామీ పత్రంలో పేర్కొంది.
1)వ్యవసాయం-అనుబంధ రంగాలు:
రైతు ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్షంగా పెట్టుకున్న ఏపీ సర్కార్...అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రవేశపెట్టి..రైతన్నకు దన్నుగా నిలిచింది. వచ్చే ఐదేళ్ల కాలానికి రైతుల్లో మరింత భరోసా నింపేందుకు కీలక అంశాలను ఎన్నికల ప్రణాళిక హామీ పత్రంలో పొందుపర్చింది.
⦁ వచ్చే ఐదేళ్లకు అన్నదాత సుఖీభవ పథకం అమలు
⦁ రైతులందరికీ ఉచితంగా పంటల బీమా పథకం
⦁ రైతులకు 12 గంటల ఉచిత విద్యుత్(పగటిపూట)
⦁ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ ధరల ఒడుదొడుకులను తట్టుకునేందుకు రూ. 5వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
⦁ మండల స్థాయిలో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల
⦁ రాష్ట్రాన్ని హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో కోటి ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తరణ
⦁ తీర ప్రాంతాల్లో ఫీషరీస్ కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు
⦁ పాడి రైతుల కోసం గోపాలమిత్రుల వ్యవస్థ పటిష్టం, ఖాళీల భర్తీ
2) నీటి పారుదల రంగం
తెదేపా సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం నలుమూలాల కరవు తరిమికొట్టాలన్న లక్ష్యంతో అనేక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. నదులు అనుసంధానంతో ప్రాజెక్టుల పూర్తని అజెండాలో పెట్టుకుంది.
⦁ కరవురహిత రాష్ట్రంగా మార్చటం
⦁ 2 కోట్ల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావటం
⦁ 2019 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి 40 లక్షల ఎకరాలకు సాగు నీరు
⦁ నీటి లభ్యత బట్టి ఎత్తిపోతల పథకాల నిర్మాణం
3) మహిళా సాధికారత
డ్వాక్రా రుణాల అందజేతతోపాటు...పసుపు-కుంకుమ వంటి పథకాలతో మహిళా సాధికారతకు కృషి చేస్తోన్న తెదేపా సర్కార్...వచ్చే ఐదేళ్ల కాలంలో మరిన్ని వినూత్న పథకాలు అందించేందుకు సిద్ధమైంది.
⦁ పసుపు-కుంకుమ పథకం కొనసాగించటం
⦁ డ్వాక్రా మహిళలందరికీ స్మార్ట్ ఫోన్లు
⦁ మహిళా ఉద్యోగులకు స్కూటర్ కొనుగోలపై రాయితీ
⦁ చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం
⦁ రాబోయే ఐదేళ్ల కాలంలో మహిళలను ఆర్థిక సాయాన్ని 2 లక్షల కోట్లకు పెంచటం
⦁ వడ్డీ రాయితీ అర్హత పరిమితి రూ.10 లక్షలకు పెంపు
⦁ ఐటీడీఏల్లో హోమ్ ఫర్ ప్రేగ్నస్ట్ విమెన్ ఏర్పాటుకు హామీ
4)పేదరికం
రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించేలా బలహీనవర్గాల, మహిళ సంక్షేమ కోసం కీలకమైన పథకాలు అమలు చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా రూపోందించిన అనేక పథకాలను కొనసాగింపుతోపాటు...ఆర్థిక సహాయన్ని పెంచుతున్నట్లు తెదేపా మేనిఫెస్టో కమిటీ నిర్ణయం తీసుకుంది.
⦁ ప్రస్తుతం ఉన్న 2వేల పెన్షన్‌ను 3 వేల రూపాయలకు పెంచటం
⦁ పింఛన్‌దారుల అర్హత వయస్సు 65 ఏళ్ల నుంచి 60 కి తగ్గింపు
⦁ చంద్రన్న పెళ్లికానుక లక్ష రూపాయలకు పెంపు
⦁ చంద్రన్న బీమా సొమ్ము 10 లక్షలకు పెంపు
⦁ 20 వేల జనాభా దాటిన మేజర్ గ్రామపంచాయతీల్లో అన్న క్యాంటీన్లు
5)వెనుకబడిన తరగతుల సంక్షేమం
⦁ పేద విద్యార్థులందరికీ పూర్తిగా ఫీజు రియంబర్స్మెంట్
⦁ బీసీ సబ్ ప్లాన్ చట్టానికి విధివిధానాలు రూపకల్పన
⦁ స్వయం ఉపాధిలో భాగంగా కారు రుణాలపై 25 శాతం రాయితీ
⦁ బ్యాంకులతో సంబంధం లేకుండా లక్ష రూపాయల వరకు రుణం
⦁ అమరావతి వేదికగా బీసీ స్టడీ సర్కిల్ ఏర్పాటు
⦁ విదేశీ విద్యాదరణ పథకాన్ని 15లక్షలకు పెంపు
6)కాపుల సంక్షేమం కోసం
⦁ కాపులకు ప్రకటించిన 5 శాతం రిజర్వేషన్లు అమలు
⦁ నిర్మాణంలో ఉన్న కాపు భవనాల పూర్తి
⦁ సంక్షేమానికి 5 వేల కోట్లు కేటాయింపు
7)ఎస్సీ-ఎస్టీల సంక్షేమం
⦁ ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ కాలపరిమితి 2023 వరకు పొడిగింపు
⦁ విదేశీ విద్యకు స్కాలర్షిప్ రూ.25 లక్షలకు పెంపు
⦁ రాష్ట్రవ్యాప్తంగా అంబేడ్కర్ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు, గ్రంథాలయాల స్థాపన
⦁ ప్రతి జిల్లాలో బాబుజగ్జీవన్‌రాం భవనాల నిర్మాణం
9) పట్టణాభివృద్ధి- భవిష్యత్తు ప్రణాళిక
⦁ పట్టణాల్లో ఉండే గృహాలన్నింటికీ మంచి నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు
⦁ ఆన్లైన్లోనే మున్సిపల్ సేవలు
⦁ వ్యర్థపదార్థాలను శుభ్రపరిచే వ్యవస్థల ఏర్పాటు
10) గృహనిర్మాణం..
తెదేపా సర్కార్ వచ్చాక... రాష్ట్రంలోని ఇళ్లు లేని ప్రతి పేదవారికి గృహా వసతి కల్పించేలా ఎన్టీఆర్ గృహా నిర్మాణం పథకాన్నికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద 12 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టిన తెదేపా ప్రభుత్వం...వచ్చే ఐదేళ్లలో భారీ స్థాయిలో గృహ నిర్మాణం చేపట్టనున్నట్లు మేనిఫెస్టోలో హామీనిచ్చారు.
⦁ శాశ్వత గృహాలు లేని వారికి గృహావసతి
⦁ పట్టణ ప్రాంతంలోని అర్హులైన పేదలందరికి గృహ నిర్మాణం
⦁ గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పేదలకు అన్ని సౌకర్యాలు
11) యువజన ప్రణాళిక
⦁ 18-22 ఏళ్ల మధ్య ఉన్న యువతకు 2వేల భృతి
⦁ యువత స్థాపించే పరిశ్రమలకు వడ్డీ రాయితీ
12) వైద్య రంగం
⦁ అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాన్సర్ ఆసుపత్రులు
⦁ ప్రభుత్వ వైద్యశాలలో వైద్య పరీక్షలు, మందులు పూర్తి ఉచితం
⦁ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో వైద్యకళాశాల ఏర్పాటు
13)ప్రభుత్వ ఉద్యోగులు
⦁ సీపీఎస్ రద్దుకు అంగీకారం
⦁ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత
⦁ నాల్గో తరగతి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62కు పెంపు
మేనిఫెస్టోలో ఉద్యోగుల సంక్షేమం, శాంతి భద్రతలు, వైద్య రంగం, పరిశ్రమల స్థాపనతో నిరుద్యోగులుకు ఉద్యోగుల కల్పనతోపాటు విద్యారంగం పటిష్టపరచటం వంటి అంశాలను ఎన్నికల హామీ పత్రంలో పొందపర్చింది.
సమరాంధ్ర-2019: తెదేపా మేనిఫెస్టో వచ్చేసింది!! - మేనిఫెస్టో
అన్ని వర్గాల సంక్షమమే ధ్యేయంగా తెదేపా ఎన్నికల ప్రణాళిక ముందుకొచ్చింది. ఆర్థిక మంత్రి యనమల ఆధ్వర్యాన తయారు చేసిన మేనిఫెస్టోను ఉండవల్లి ప్రజావేదికగా అధినేత చంద్రబాబు విడుదల చేశారు. 2014లో ఇచ్చిన హామీల అమలుతో పాటు.. వచ్చే ఐదేళ్ల కాలానికి చేపట్టబోయే కార్యక్రమాలను ఎన్నికల హామీ పత్రంలో పొందుపరిచారు.

Body:ఫ
Conclusion:బ