ETV Bharat / state

వైరి నేతలను కలిపాం... శ్రేణులను కాదేమో...! - tdp internal thinking loose in election

సార్వత్రిక ఎన్నికల్లో వైరి వర్గాలను ఒక తాటిపైకి తీసుకురావటం పార్టీ కొంపముచ్చిందా..? ఈ క్రమంలో సొంత వర్గాన్ని దూరం చేసుకున్నామా.? నాయకులు కలిసినా క్షేత్రస్థాయిలో క్యాడర్ మాత్రం కలవలేదా..?అనే అంతర్మథనం తెలుగుదేశం పార్టీలో సాగుతోంది. శత్రువులు దగ్గర చేసుకునే ప్రయత్నంలో మిత్రులను కోల్పోయామనే భావనలో ఉంది తెలుగుదేశం.

వైరి నేతలను కలిపాం... శ్రేణులను కాదేమో...!
author img

By

Published : Jun 9, 2019, 8:34 AM IST

Updated : Jun 9, 2019, 12:25 PM IST

దశాబ్దాల వైరం ఉన్న నేతలను ఒకే గూటికి తీసుకొచ్చారు. ఉప్పు -నిప్పుగా ఉన్నోళ్లు ఒకే వేదికపైకి రావడమే కాదు పార్టీ విజయానికి కలిసి ప్రచారమూ చేశారు. ఫలితాలు మాత్రం వేరుగా వచ్చాయి. నాయకులు కలిసినా కార్యకర్తలు కలవలేదనే లెక్కలు వేస్తోంది తెలుగుదేశం అదిష్ఠానం. ఫలితాల సరళి విశ్లేషిస్తున్నా అధినాయకత్వం వైరి వర్గాల చెలిమితో పార్టీకి నష్టం కలిగిందనే అంచనా వేస్తోంది.

వైరి నేతలను కలిపాం... శ్రేణులను కాదేమో...!

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా అధినేత చంద్రబాబు ఉప్పు-నిప్పుగా ఉండే నేతలందర్నీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. అందులో అందరిలో ఆసక్తిని రేపిన జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి, రామ సుబ్బారెడ్డి వర్గాలను ఏకం చేసి ఒకరిని అసెంబ్లీకి మరొకర్ని పార్లమెంటుకి పోటీ చేయించారు. అదేవిధంగా కర్నూలు జిల్లాలో మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని పార్టీలోకి తీసుకొచ్చి కే.ఈ కుటుంబంతో వైరాన్ని పక్కనపెట్టేలా చేశారు. విజయనగరం జిల్లాలో అశోక గజపతి రాజు, సుజయ్ కృష్ణ రంగారావు, కిషోర్ చంద్రదేవ్‌ను ఒకే తాటిపైకి తీసుకువచ్చి పోటీ చేయించారు. అనంతపురంలో 2014లోనే జేసీ, పరిటాల కుటుంబాలని కలిపారు. చిత్తూరు జిల్లాలోనూ దశాబ్దాల విభేదాలు పక్కన పెట్టి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు చంద్రబాబు. ఈ ప్రయత్నాలేవీ ఎన్నికల్లో ఫలించలేదు.

ఈ కలయికలపై పార్టీలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. నాయకులు కలిసినంత మాత్రాన శ్రేణులు కలవలేదని వాదిస్తున్నారు. పార్టీలో ఉండి రాజీ పడకుండా పని చేసేవారే ఈ ఎన్నికల్లో విజయం సాధించారని ఉదాహరణగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లాలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, చీరాల ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తిని కలపటానికి చేయని ప్రయత్నం లేదు. బహిరంగ వేదికల్లోనూ పక్కపక్కన నిలబడటానికి ఇష్టపడేవారు కాదు. చివరికి చెరో స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. నాయకుడు అనేవాడు సమస్యలకు ఎదురువెళ్లి విజయం సాధించాలని కార్యకర్తలు కోరుకుంటారు తప్ప రాజీని ఇష్టపడరనే వాదన వినిపిస్తున్నారు పలువురు కార్యకర్తలు. వివిధ వర్గాలను చేరదీసే ప్రయత్నంలో తెలుగుదేశానికి వెన్నుదన్నుగా నిలిచిన వర్గాలను దూరం చేసుకున్నామనే భావన పార్టీలో వ్యక్తమవుతోంది.

Intro:444

Body:654

Conclusion:ఈ వార్తకు సంబంధించి వాట్సాప్ లో విజువల్స్ పంపడమైనది

కడప జిల్లా బద్వేలు పట్టణంలో 2 వేరు వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు గాయపడ్డారు. పట్టణంలో నెల్లూరు రోడ్డు ప్రమాదంలో తుల, నందిని వరలక్ష్మమ్మ తీవ్రంగా గాయపడ్డారు గోపవరం మండలం భూమిరెడ్డి పల్లె కు చెందిన వీరు ద్విచక్ర వాహనంలో పట్టణంలో పని ముగించుకుని సొంత గ్రామానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది .స్థానికులు వెంటనే ఈ ఘటన గమనించి క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి ప్రత్యేక వాహనంలో తరలించారు. పోరుమామిళ్ల బైపాస్ రోడ్డులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ద్విచక్ర వాహనంలో వెళుతూ ఓ వ్యక్తి ఆగి ఉన్న లారీ నీ ఢీ కొట్టి తీవ్రంగా గాయపడ్డారు .స్థానికులు ఈ పరిస్థితి గమనించి క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి ఇ పోరుమామిళ్ల మండలం రేపల్లె కు చెందిన చినరాయుడు గా పోలీసులు గుర్తించారు. రెండు రోడ్డు ప్రమాదాలు ఘటనకు సంబంధించి బద్వేల్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు.
Last Updated : Jun 9, 2019, 12:25 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.