ETV Bharat / state

నేరాలు - ఘోరాలు.. వైకాపా విధానాలు: చంద్రబాబు

వైకాపా నాయకుల తీరుపై.. ప్రభుత్వ పనితీరుపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలన చేతకాకే.. తప్పులు కప్పిపుచ్చుకునేందుకే.. తమను లక్ష్యంగా చేసుకుంటున్నారని పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్​లో విమర్శించారు.

cbn
author img

By

Published : Jul 5, 2019, 9:38 AM IST

రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై.. పార్టీ నేతలతో టెలీ కాన్ఫరెన్స్ చేశారు.. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు. పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడం.. వారి రక్షణ, ఆస్తుల భద్రత.. నాయకులదే అని స్పష్టం చేశారు. 40 శాతానికి పైగా ప్రజలు ఓట్లేసిన విషయాన్ని సీనియర్ నాయకులకు గుర్తు చేసిన చంద్రబాబు.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి దిశానిర్దేశం చేశారు. 40 రోజుల్లో ఆరుగురు తెదేపా కార్యకర్తలు దాడుల్లో చనిపోయారని.. ఇది కిరాతకమనీ అన్నారు.

అన్నిచోట్ల వైకాపా వర్గీయుల అరాచకాలు పేట్రేగాయి. తెలుగుదేశం కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. పార్టీ మద్దతుదారులను గ్రామాలు ఖాళీచేసి వెళ్లాలని బెదిరిస్తున్నారు. ఇళ్లపై సామూహిక దాడులకు పాల్పడుతున్నారు. పొలాలు సాగు చేయనివ్వకుండా అడ్డం పడుతున్నారు. అంగన్ వాడి భవనాలు కూలగొడుతూ.. రోడ్లు తవ్వేస్తూ.. రహదారులకు అడ్డంగా గోడలు కడుతూ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇన్ని దాడులు - దౌర్జన్యాలు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ చూడలేదు. అధికారం అండతో అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి. ఎస్సీలపై దాడుల గురించి కమిషన్ కు ఫిర్యాదు చేయాలి. ఏ మహిళకు ఎదురుకాకూడని పరాభవం తట్టుకోలేకే పద్మ ఆత్మహత్య చేసుకుంది. అది కూడా హత్యేనన్నారు. ఈ పాపం శాపంగా మారి వైకాపాని పతనం చేస్తుంది.

- చంద్రబాబు, తెదేపా జాతీయ అధ్యక్షుడు

రాజకీయం ఎన్నికలప్పుడే చెయ్యాలి కానీ మిగిలిన సమయంలో రాష్ట్ర అభివృద్దిపైనే దృష్టి పెట్టాలని శ్రేణులకు చంద్రబాబు హితవు పలికారు. ఇదే తెలుగుదేశం నమ్మిన సిద్దాంతమని స్పష్టం చేశారు. నేరాలు - ఘోరాలే వైకాపా విధానాలని... ప్రజలే ఆ పార్టీని దూరం పెడతారని చెప్పారు. విత్తనాలు, విద్యుత్ కోతలు, విద్యార్దులకు మధ్యాహ్న భోజనం.. ఇలా ఏ సమస్య వచ్చినా తెలుగుదేశంపై తోసి తప్పుకోవాలని సీఎం జగన్ చూస్తున్నారని దుయ్యబట్టారు. వారి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అటు దాడులు, దౌర్జన్యాలు కొనసాగిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామన్నారు.

Intro:ap_knl_101_05_collector_visit_av_ap10054. allagadda 8008574916 కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జిల్లా కలెక్టర్ వీరపాండియన్ ఆకస్మిక పర్యటన నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో రాత్రి బస చేశారు ఉదయమే ఆయన వసతి గృహంలోని మౌలిక సదుపాయాలను పరిశీలించారు మరుగుదొడ్లు లేకపోవడం స్నానపు గదులు తలుపులు లేకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులు ఉంటున్న గదుల్లో ఫ్యాన్ లేకపోవడం పట్ల ఆగ్రహించారు ఆయన పట్టణ శివార్లలోని ఎస్టీ పాఠశాలను సందర్శించారు అక్కడి సౌకర్యాలు బాగా లేకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామన్నారు

Body:కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జిల్లా కలెక్టర్ పర్యటన

Conclusion:ఆళ్లగడ్డ జిల్లా కలెక్టర్ పర్యటన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.