స్పీకర్గా తమ్మినేని సీతారాం...
శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాంను శాసనసభ స్పీకర్గా ఎంపిక చేశారు. కళింగ సామాజికవర్గానికి చెందిన తమ్మినేని... ఇప్పటికి ఆరుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. మంత్రిగా పనిచేసిన సీతారాం స్పీకర్గా సరిపోతారని జగన్ భావించారు. ఆముదాలవలసకు చెందిన తమ్మినేని సీతారాం... 1955 జూన్ 10న జన్మించారు. బీఏ చదువుకున్న ... ఆమదాలవలస నుంచి 1994, 1999, 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983, 1985, 1991లో జరిగిన ఉపఎన్నికల్లోనూ విజయం సాధించారు. 1994లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో యువజన సర్వీసుల మంత్రిగా పనిచేశారు. 1995లో చంద్రబాబు మంత్రివర్గంలో మున్సిపల్ శాఖామంత్రిగా... 1997లో చంద్రబాబు కేబినెట్లో సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు.
ఉప సభాపతిగా కోన రఘుపతి...
గుంటూరు జిల్లా బాపట్ల నుంచి గెలుపొందిన కోన రఘుపతిని డిప్యూటీ స్పీకర్ పదవి వరించింది. 2014లో తొలిసారి బాపట్ల నుంచి గెలిచిన కోన... గతంలో చిన్నతరహా పరిశ్రమల సంఘం ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. తన తండ్రి పేరిట ఛారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసి... సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజా ఎన్నికల్లో విజయం సాధించిన రఘుపతికి... ఉపసభాపతిగా అవకాశం ఇచ్చారు జగన్.
ఇదీ చదవండీ...