కేంద్ర ఎన్నికల సంఘానికి దేశ అత్యున్నత న్యాయస్థానం కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీలు, అభ్యర్థుల వివరాలను పత్రికలు , టీవీలు, వెబ్సైట్లలో పొందుపర్చాలని 2018లో సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల సంఘం మాత్రం వివరాలు పొందుపర్చలేదు. పార్టీలు, అభ్యర్థుల కేసుల వివరాలకు సంబంధించిన ప్రకటనలు ఏవని ప్రశ్నించింది. ముఖ్యమైన అంశాన్ని పట్టించుకోలేదని ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారం రోజుల్లో సమాధానం చెప్పాలని సుప్రీం ఆదేశించింది.
ఇదీ చదవండి