నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వడగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బలమైన ఈదురుగాలలు వీస్తాయని హెచ్చరించింది. కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్లు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా 40 నుంచి 50 కిలోమీటర్ల మేర ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. కొన్ని ప్రాంతాల్లో ఇవాళ్టి నుంచి నాలుగురోజుల పాటు... ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక, రాయలసీమ సరిహద్దు మీదుగా...సముద్రమట్టానికి ఒకటిన్నర కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వెల్లడించింది. పశ్చిమ బంగా నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ఉపరితల ద్రోణి ఉందని.. ఆ రాష్ట్రంతో పాటు పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఉందని ప్రకటించింది.
ఇవి చదవండి..ఆ 2 జిల్లాల్లో పిడుగులు పడతాయ్.. జాగ్రత్త!