ETV Bharat / state

సెంటిమెంట్‌ తప్పిందా... పనిచేసిందా..? - sentiment

రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన పార్టీల అభిమానులకు సెంటిమెంట్ ఎక్కువ. కొందరు నేతలు గెలిస్తే తమ పార్టీ అధికారంలోకి రాదని... కొందరు గెలిస్తే కచ్చితంగా అధికారంలోకి వస్తామని కార్యకర్తలు, పార్టీల అభిమానులు నమ్ముతుంటారు. మరి ఈ ఎన్నికల్లో ఆ సెంటిమెంట్ ఎంతవరకు పనిచేసింది... ఎంతవరకు తప్పింది అనే చర్చలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయి.

ఆంధ్రా ఎన్నికలు
author img

By

Published : May 25, 2019, 8:07 AM IST

Updated : May 25, 2019, 4:13 PM IST

సెంటిమెంట్‌ తప్పిందా... పనిచేసిందా..?

రాష్ట్రంలో సెంటిమెంట్ రాజకీయాలపై ఇరు పార్టీల అభిమానులు చర్చించుకుంటున్నారు. గతంలో ఏయే నేతలు నెగ్గితే తమ పార్టీ అధికారంలోకి వచ్చింది... ఎవరు గెలిస్తే అధికారానికి దూరమైంది అనే చర్చ జోరుగా సాగుతోంది. రాష్ట్ర రాజకీయాలను శాసించే గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తే వారే అధికారంలోకి వస్తారనే అభిప్రాయాలకు బలం చేకూరింది. ఈ ఎన్నికల్లో వైకాపా మూడు జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలు దక్కించుకుని రాష్ట్రంలో అధికారం చేపట్టనుంది.

తెనాలిలో గెలిస్తే.. గుంటూరు జిల్లా తెనాలిలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీ పాలనాపగ్గాలు చేపడుతుందనే అభిప్రాయం ఉండేది. గతంలో అదే జరిగింది. అందుకు తగ్గట్టుగా ఇక్కడ వైకాపా అభ్యర్ధి అన్నాబత్తుని శివకుమార్‌ విజయం సాధించారు. వైకాపా అధికార పీఠాన్ని దక్కించుకుంది. అనంతపురం జిల్లా ఉరవకొండలో తెదేపా నేత పయ్యావుల కేశవ్‌, ప్రకాశం జిల్లాలో తెదేపా నేత కరణం బలరామ్‌ గెలిస్తే తెదేపా అధికారంలోకి రాదనే సెంటిమెంట్​కు అనుగుణంగా ఆ పార్టీ ఈ ఎన్నికల్లో పరాజయం పాలైంది.

ఇక్కడి వారు మంత్రులైతే...కృష్ణా జిల్లా నుంచి మంత్రులుగా పనిచేసిన నేతలు తర్వాతి ఎన్నికల్లో గెలవరనే అభిప్రాయాలున్నాయి. గతంలో కోనేరు రంగారావు, బుద్దప్రసాద్‌ సహా పలువురి విషయంలో ఇది నిజమైంది. 2009లో గెలిచి మంత్రిగా చేసిన కొలుసు పార్థసారథి కూడా.. 2014 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లోనూ అదే ఆనవాయితీ కొనసాగింది. బరిలో నిలిచిన ఇద్దరు మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర పరాజయం పొందారు.

వీరి విషయంలో తప్పింది.. కొందరు నేతలు ఎమ్మెల్యేలుగా గెలిస్తే... వారి పార్టీ అధికారంలోకి రావనే అభిప్రాయాలు ఒట్టివేనని తేలింది. చిత్తూరు జిల్లా నగరి నుంచి ఆర్‌కే రోజా, గుడివాడ నుంచి కొడాలి నాని విజయం సాధించినా వైకాపా అధికారంలోకి వచ్చింది. గతంలో వీరిద్దరు ఉన్న పార్టీ అధికారంలోకి రాలేదనే సెంటిమెంట్ ఉంది. ఈ అభిప్రాయాల్లో ఏది నిజమైనా... ఏది అబద్ధమైనా... వైకాపా గాలీ వీచింది. ఈ సెంటిమెంట్ రాజకీయాలు నమ్మొద్దని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది కేవలం రాష్ట్రంలో పలు పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన చర్చే.

sample description
Last Updated : May 25, 2019, 4:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.