ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 5 వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించాలన్న సుప్రీంకోర్టు ఆదేశంపై తెదేపా అధినేత చంద్రబాబు స్పందించారు. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత... ఏలా ముందుకెళ్లాలనే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.
ఓ వైపు వీవీ ప్యాట్లను లెక్కించాలంటూనే... ఆ అంశం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందనటం సమంజసం కాదన్నారు. 50 శాతం వీవీ ప్యాట్లను లెక్కించడానికి వారం పడుతుందని ఎన్నికల సంఘం అనడం సరికాదన్న చంద్రబాబు... ఈ విషయంలో సుప్రీంకోర్టు సలహాలు తీసుకోవాలన్నారు. అంతేగానీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే.. ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారుతుందన్నారు.
ఇదీ చదవండి