ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగకుండా ఆపడానికి యాజమాన్యం చర్యలు ప్రారంభించింది. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశానికి రావాలని కార్మిక సంఘాల నేతలను ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆహ్వానించారు. గతనెల 9న 27 డిమాండ్లతో ఐకాస నేతలు సమ్మెనోటీసు ఇచ్చారు. కార్మికులు సమ్మెకు దిగే గడువు సమీపిస్తుండటంతో అధికారులు చర్చలకు సిద్ధమయ్యారు.
కార్మికుల వేతన సవరణ బకాయిలు చెల్లించాలన్న కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్‌ను ఆర్టీసీ ఇప్పటికే పరిష్కరించింది. కార్మికులకు చెల్లించాల్సిన 40 శాతం బకాయిలు విడుదల చేసింది. ఆర్టీసీలో అద్దె బస్సుల పెంపు, సిబ్బంది కుదింపు నిర్ణయాలు ఉపసంహరించుకోవడం సహా... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం... నష్టాలను ప్రభుత్వమే భరించడం వంటి డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్ల పరిష్కారంపై కార్మిక సంఘాల నేతలతో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇవాళ చర్చలు జరపనున్నారు.
ఇదీ చదవండీ... 26 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు