రౌడీ రాజ్యంలో తాము నిలబడలేక పోతున్నామని, గ్రామాల్లో పరిస్థితి దుర్భరంగా మారిందని పలు గ్రామల ప్రజలు చంద్రబాబు దగ్గర ఆవేదన చెందారు. ఇలా ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయించడం ఎప్పుడూ లేదన్నారు. అన్నింటిని తట్టుకోవాలని, సహనంగా ఉండాలని చంద్రబాబు ప్రజలను కోరారు. ప్రత్యర్థులు కవ్వించినా ఆవేశానికి లోనుకావద్దని, కక్షల వల్ల కుటుంబాలు రోడ్డున పడతాయని సూచించారు. పార్టీ సమావేశంలో దాడులు-దౌర్జన్యాలను ఖండిస్తూ తీర్మానం ఆమోదించినట్లు చంద్రబాబు తెలిపారు. త్వరలోనే తెదేపా ప్రజా ప్రతినిధుల బృందం డీజీపీ కలిసి వినతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. చంద్రబాబును కలిసినవారిలో కడప, ప్రకాశం, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లా వాసులు ఉన్నారు.
తెదేపా గెలిచాకే ఊళ్లోకి రావాలంటూ దాడులు! - గుంటూరు
తమపై దాడులు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయని పలు గ్రామాల రైతులు తెదేపా అధినేత చంద్రబాబు దగ్గర వాపోయారు. ఊళ్లు ఖాళీచేసి వెళ్లాలని, మళ్లీ తెదేపా గెలిచాకే ఊళ్లలోకి రావాలంటున్నారని ఫిర్యాదు చేశారు. తమ పొలాల్లోకి వెళ్లనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు చంద్రబాబుకి చూపించారు.