ETV Bharat / state

గంటలు గడచినా ఎందుకు రాలేకపోతున్నారు..?

అగ్నిప్రమాదం జరిగినప్పుడు... ఎంత త్వరగా మంటలు అదుపులోకి తెస్తే... అంత నష్టం తగ్గుతుంది. నష్టనివారణ అగ్నిమాపక సిబ్బందిపై ఆధారపడి ఉంటుంది. చాలా దేశాల్లో ప్రమాదం జరిగిన నిమిషాల్లో ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొస్తారు. కానీ రాష్ట్రంలో పరిస్థితి భిన్నంగా ఉంది. సంఘటన జరిగి గంటలు గడచినా అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేకపోతున్నారు. దూరప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలుండటంతో సకాలంలో చేరడం కష్టంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా 32 నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలానే ఉంది. సరిహద్దుల్లో పొరుగు రాష్ట్రాల నుంచి అగ్నిమాపక శకటాలు రావాల్సిన దుస్థితి నెలకొంది.

గంటలు గడచినా ఎందుకు రాలేకపోతున్నారు..?
author img

By

Published : Apr 17, 2019, 6:07 AM IST

అత్యవసర సమయాల్లో... అత్యంత వేగంగా వచ్చి సేవలందించే వాహనాల పేరు వినగానే అంబులెన్స్... అగ్నిమాపక శకటాలే అందరికీ గుర్తొస్తాయి. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో అగ్నిప్రమాదాల కారణంగా జరుగుతున్న నష్టం చూస్తే... అగ్నిమాపక శకటాలు ఆ జాబితా నుంచి పోయాయ అన్న అనుమానం కలుగుతోంది ప్రజలకు. ఇటీవల కొన్ని ప్రాంతాల్లో ప్రమాదం జరిగి గంటలు గడచినా... ఫైరింజన్​లు సకాలంలో చేరుకోకపోవడమే ఇందుకు కారణం. సమాచారమిచ్చాకా... సుమారు గంటన్నర తరువాత వస్తున్నారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరుగుతోంది.
అగ్నిమాపక సిబ్బంది రావాలంటే అవస్థలే...
రాష్ట్రంలో చాలా ప్రాంతాలు అగ్నిమాపక కేంద్రాలకు దూరంగా ఉన్నాయి. చిత్తూరు జిల్లా పాలసముద్రం పరిధిలోని గ్రామాల్లో ఎక్కడైనా అగ్నిప్రమాదం జరిగితే ... 45 నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తూరు నుంచి ఫైరింజన్​లు రావాలి. సరిహద్దు గ్రామాల్లో ఎక్కడైనా అగ్నిప్రమాదం సంభవిస్తే తమిళనాడులోని పల్లిపట్టు, సోలింగర్ కేంద్రాలపై ఆధారపడాల్సిన దుస్థితి నెలకొంది. అయినా గంటన్నర సమయం పడుతుంది. శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలోని గ్రామాల్లో ప్రమాదం జరిగితే టెక్కలి, నర్సన్నపేటల నుంచి అగ్నిమాపక శకటాలు రావాలి. అవయినా సమయానికి వస్తాయనే నమ్మకం లేదనే చెబుతున్నారు.
మన్యంలో మరీ దారుణం...
విశాఖ మన్యం ప్రాంతంలో పాడేరు మినహా మిగతా ఎక్కడా అగ్నిమాపక కేంద్రాలు లేవు. అరకు, అనంతగిరి, డుంబ్రిగూడ, పెదబయలు, ముంచంగిపుట్టు, హుకుంపేట, జి.మాడుగుల, జీకే వీధి, చింతపల్లి, సీలేరు మండలాల పరిధిలో ఎక్కడ అగ్నిప్రమాదం జరిగినా... పాడేరు నుంచే అగ్నిమాపక సిబ్బంది చేరుకోవాలి. పెదబయలు, హుకుంపేట మినహా మిగతా మండల కేంద్రాలు పాడేరుకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ ప్రాంతాలకు ఫైరింజన్​లు చేరుకోవటానికి గంటన్నరకుపైగా సమయం పడుతుంది. అగ్నిమాపక కేంద్రాలు దూరంగా ఉండటంతో నష్టం పెరుగుతోంది.
సరిహద్దు గ్రామాల్లో నష్టం ఎక్కువే...
అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజకవర్గ పరిధిలోని పుట్లూరు, ఎల్లనూరు మండలాల్లోని గ్రామాల్లో ప్రమాదం జరిగితే 35 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని తాడిపత్రి నుంచి అగ్నిమాపక వాహనం రావాలి. కర్నూలు జిల్లా పగిడ్యాల మండల పరిధిలోని గ్రామాల్లో అగ్నిప్రమాదం జరిగితే 40 కిలోమీటర్ల దూరంలోని కర్నూలు, ఆత్మకూరు నుంచి రావాలి. రాష్ట్ర సరిహద్దుల్లో అగ్నిప్రమాదం జరిగితే... అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్థలికి చేరుకునే సమయానికి ఇళ్లు, ధాన్యం పూర్తిగా దగ్ధమవుతున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యను గుర్తించి అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఇదీ డదవండి..

మిట్ట మధ్యాహ్నం బైక్​పై వెళ్తున్నారా... కాస్త జాగ్రత్త!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.