ETV Bharat / state

మళ్లీ... వేడెక్కనున్న భానుడు.. పిడుగులతో కూడిన జల్లులు - high_temperatures

రాగల రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో 47డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తీవ్రమైన ఉష్ణోగ్రతల ప్రభావంతో కొన్ని చోట్లు పిడుగులతో కూడిన జల్లులు పడతాయని వెల్లడించింది.

మరో 2,3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు-పిడుగులతో కూడిన జల్లులు
author img

By

Published : May 14, 2019, 3:24 PM IST

మరో 2,3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు-పిడుగులతో కూడిన జల్లులు

ఓ వైపు తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు.. మరోవైపు ఈదురుగాలులు, పిడుగులతో రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వాయువ్య భారత్ నుంచి వీస్తున్న ఉష్ణగాలుల కారణంగా కోస్తాంధ్ర జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇంకా గరిష్ట స్థాయిలోనే నమోదు అవుతున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం 41 నుంచి 43 డిగ్రీల మధ్య...

ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలో ని కడప, కర్నూలు జిల్లాల్లో 43 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అటు ఉభయ గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 41 నుంచి 43 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది.

మళ్లీ వేడెక్కనున్న వాతావరణం...

గడచిన వారం రోజులతో పోలిస్తే స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గినా.. ఈ నెల 15 నుంచి మళ్లీ ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. మరో 2,3 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల తీవ్రత 47 డిగ్రీలకు మించే అవకాశముందని ఐఎండీ స్పష్టం చేస్తోంది.

పిడుగులతో కూడిన వర్ష సూచన...

మరోవైపు తీవ్రస్థాయికి చేరిన ఉష్ణోగ్రతల కారణంగా చాలా చోట్ల ఉరుములు, ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తాయని వాతావరణ శాఖ స్ఫష్టం చేసింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా, ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, విజయనగరం జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని చోట్ల పిడుగులతో కూడిన జల్లులు పడతాయని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి-వర్షాలు కురవాలి.. దేశం సుభిక్షంగా ఉండాలి!

Intro:Ap_Nlr_01_14_Ex_Minister_Manikyalarao_Press_Kiran_Avb_C1

ఎన్నికల కమిషన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత మాణిక్యాలరావు విమర్శించారు. ఈవీఎంల పనితీరుపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని ఎన్నికల కమిషన్ నియంత్రించాలని ఆయన నెల్లూరులోని భాజపా కార్యాలయంలో కోరారు. ఎవరికి ఓటు వేసిన కమలం గుర్తుకే పడుతోందని చెబుతున్న చంద్రబాబు, తమకు మాత్రం 130 సీట్లు వస్తాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి సుపరిపాలన అందిస్తున్నామని చెప్తున్న వారే ఇలా మాట్లాడటం తగదన్నారు.
బైట్: మాణిక్యలరావు, మాజీ మంత్రి, భాజపా నేత.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.