గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ డీజీపీ గౌతం సవాంగ్‌ను కలిశారు. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై జరుగుతున్న దాడులను డీజీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి వరుసగా దాడులు జరుగుతున్నాయని వివరించారు. వైకాపా దాడులు, దౌర్జన్యాలను నియంత్రించేలా పోలీసు అధికారులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కొత్తగా డీజీపీగా నియమితులైనందుకు అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండీ...