Ravindra Jadeja Records : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కేరీర్లో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మ (311) ను అధిగమించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో జడ్డూ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో గ్లెన్ ఫిలిప్‌ను పెవిలియన్ చేర్చిన జడేజా ఈ రికార్డు సాధించాడు. ప్రస్తుతం జడేజా 77 టెస్టుల్లో 314* వికెట్లతో కొనసాగుతున్నాడు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. తన కెరీర్లో ఒక ఇన్నింగ్స్‌లో 5+ వికెట్లు తీయడం ఇది 14వ సారి.
ఇక దీంతోపాటు జడ్డూ మరో ఘనత సాధించాడు. టీమ్ఇండియా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన లిస్ట్‌లో టాప్ 5లోకి దూసుకెళ్లాడు. ఈ జాబితాలో దిగ్గజం అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు
- అనిల్ కుంబ్లే - 619 వికెట్లు
- రవిచంద్రన్ అశ్విన్ - 533* వికెట్లు
- కపిల్ దేవ్ - 434 వికెట్లు
- హర్భజన్ సింగ్ - 417 వికెట్లు
- రవీంద్ర జడేజా - 314* వికెట్లు
2012లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన జడ్డూ ఇప్పటివరకూ 77 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 314 వికెట్లు పడగొట్టాడు. అటు బ్యాటింగ్‌లోనూ రాణించిన జడేజా 111 ఇన్నింగ్స్‌ల్లో 3215 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Ish Sodhi ✅
— BCCI (@BCCI) November 1, 2024
Matt Henry ✅
Two wickets in an over shortly after the Tea Break and Ravindra Jadeja completes a five-wicket haul 👏 👏
Live ▶️ https://t.co/KNIvTEy04z#TeamIndia | #INDvNZ | @imjadeja | @IDFCFIRSTBank pic.twitter.com/pIsQWXsIF2
ఇక మ్యాచ్ విషయానికొస్తే టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకు ఆలౌటైంది. స్పిన్‌కు అనుకూలించిన ముంబయి వాంఖడే పిచ్‌పై మనోళ్లు చెలరేగిపోయారు. స్టార్ బ్యాటర్ విల్ యంగ్ (71 పరుగులు), డారిల్ మిచెల్ ( 82 పరుగులు) ఇద్దరే హాఫ్ సెంచరీలతో రాణించారు. ఓపెనర్ టామ్ లేథమ్ (28 పరుగులు), డేవన్ కాన్వే (4 పరుగులు), రచిన్ రవీంద్ర (5 పరుగులు), టామ్ బ్లండెల్ (0), గ్లెన్ ఫిలిప్స్ (17 పరుగులు) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. రవీంద్ర జడేజా 5, వాషింగ్టన్ సుందర్ 4, ఆకాశ్ దీప్ 1 వికెట్లు దక్కించుకున్నారు.
జడేజా 'ట్రిపుల్ సెంచరీ' - టీమ్ఇండియా ఆల్‌రౌండర్ రేర్ రికార్డ్ - Ravindra Jadeja 300 Wickets
అశ్విన్, జడ్డు 'ది సేవియర్స్'- దెబ్బకు 24ఏళ్ల రికార్డు బ్రేక్ - Ind vs Ban Test Series 2024