ETV Bharat / state

నమ్మకాన్ని వమ్ముచేయం... ప్రజలకు సేవచేస్తాం - tammineni

శాసన సభాపతిగా ఎంపికైన తమ్మినేని సీతారాం, మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన మోపిదేవి వెంకటరమణ, బోత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి జగన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. తమపై నమ్మకం ఉంచి పదవులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్
author img

By

Published : Jun 9, 2019, 5:49 AM IST

ఈ నెల 13న ఎమ్మెల్యేలంతా తనను సభాపతిగా ఎన్నుకుంటారని... ఆ పదవి చేపట్టబోతోన్న తమ్మినేని సీతారాం తెలిపారు. 12న శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయని... నూతన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నట్లు తెలిపారు. తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి కుటుంబ సభ్యులతో వచ్చిన తమ్మినేని సీతారాం... తనను శాసన సభాపతి స్థానానికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. నిస్పక్షపాతంగా సభను నడుపుతానని తమ్మినేని పేర్కొన్నారు. గతంలో జరిగిన తప్పులు ఇకపై జరగబోవని అన్నారు.

పురపాలక శాఖ మంత్రిగా తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలకు సేవ చేస్తానని ఆ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏపీని ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వంలో పురపాలక శాఖలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్న ఆయన... తమ హయాంలో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. తాడేపల్లిలోని జగన్ నివాసానికి కుటుంబంతోసహా వచ్చి సీఎంను కలిశారు. మంత్రి పదవి ఇచ్చినందుకు ధన్యావాదాలు తెలిపారు. సీఆర్డీఏపై ముఖ్యమంత్రి సమీక్ష చేసిన అనంతరం రాష్ట్ర అభివృద్ధి నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు.

తనకు కేటాయించిన పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్ శాఖలను సమగ్రంగా ప్రక్షాళన చేస్తానని ఆ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. శాఖకు సంబంధించి జగన్ పాదయాత్ర సహా... మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని అన్నారు. ప్రస్తుతం వ్యవస్థల్లో అనేక లొసుగులు ఉన్నాయన్న మోపిదేవి... ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో వచ్చి సీఎం జగన్​ను మర్యాదపూర్వకంగా కలిశారు. తనకు మంత్రి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.

ఇదీ చదవండీ...

10 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించనున్న నైరుతి

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.