తెదేపా ప్రభుత్వం మత్స్యకారులను ఓటు బ్యాంకుగానే వాడుకుందని... వారి కోసం ఏమీ చేయలేదని మంత్రి మోపిదేవి వెంకట రమణ ఆరోపించారు. వారి సంక్షేమం కోసం వైకాపా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రెండళ్ల క్రితం ప్రకటించిన డీజిల్ సబ్సిడీ డబ్బులు ఇప్పటికీ మత్స్యకారుల అకౌంట్లలో పడలేదని మండిపడ్డారు. డీజిల్ సబ్సిడీ పెంచి వైకాపా ప్రభుత్వం 100 కోట్లు బడ్జెట్లో కేటాయించిందన్నారు. మత్స్యకారులను ఎస్టీలో చేర్చే విషయాన్ని ఆలోచిస్తామన్నారు.
ఇదీ చదవండి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్: చంద్రబాబు