ETV Bharat / state

ఇంకెప్పుడు ఆరోగ్య భారత్​ సాకారమయ్యేది? - మోదీ ప్రభుత్వం

మన దేశ జనాభా 130 కోట్లు... అంతమందికి ఉన్నది ఎనిమిది లక్షల మంది డాక్టర్లే. అందులో అలోపతీ డాక్టర్లుగా చలమణీ అవుతున్న వారిలో 31 శాతం మాధ్యమిక విధ్య అభ్యసించిన మున్నాబాయిలే. స్వయంగా మూడేళ్ల క్రితం భారత వైద్యరంగ దుస్థితిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన వాస్తవాలివి. తమ జీవిత కాలంలో స్పెషలిస్టు డాక్టర్లను చూడని భారతీయులు 70 కోట్ల మంది. ఇలా చెప్పుకుంటూ పోతే భారత వైద్య రంగంలో ఏ రోగానికి ఏ మెడిసిన్ ఇవ్వాలో తెలియని డాక్టర్లు చాలామంది.

medical_situation_in_india
author img

By

Published : Jun 5, 2019, 7:21 PM IST

Updated : Jun 6, 2019, 4:44 PM IST

గ్రామీణ ప్రాంతాల్లో 19 శాతం లోపు అలోపతీ వైద్యులే వృత్తిపరమైన నైపుణ్యం కలిగినవారన్న నివేదిక... అబద్ధాల పుట్టగా కేంద్రం నిరుడు లోక్‌సభలో తోసిపుచ్చింది. దేశంలో ఇప్పటికీ అయోగ్య వైద్యసిబ్బందికి ఢోకా లేనేలేదని బ్రిటిష్​ మెడికల్ జర్నల్ తాజా కథనం. మరోవైపు డాక్టర్లు, నర్సులు, మంత్రసానులు, ఇతర పారామెడికల్ సిబ్బంది అందరినీ కలిపి లెక్కిస్తే.. 54 శాతం దాకా సరైన అర్హతలు లేని వారేనంటున్నాయి నివేదికలు. ఇందులో ఏది నిజం..? వాడుతున్న ఇంజెక్షన్లనే మళ్లీ రోగులకు పొడిస్తున్న కొందరు డాక్టర్లు.. హెచ్​ఐవీ వ్యాప్తికి కారణమవుతున్న సంఘటనలు ఎందుకు పెరుగుతున్నాయి?

యూపీ ఘటనే ఉదాహరణ

దేశంలో 38 లక్షల మేర ఆరోగ్య సిబ్బంది ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నా... వాస్తవ పరిస్థితి వేరు. తామూ డాక్టర్లమేనంటూ వివిధ సంఘాల్లో పేర్లు నమోదు చేయించుకున్న వారి సంఖ్య దాదాపు 25 లక్షలు. అంటే.. సిబ్బంది కరవు అధికారిక గణాంకాలను మించి ఉన్నట్లే. ఉన్న వారిలో సరైన అర్హత కలిగిన వారు తక్కువ...ఈ కారణం కూడా నాటు, నకిలీ వైద్యులు పుట్టుకు రావడానికి ఊపిరి పోస్తోంది. ఒకే సిరంజీతో ఇంజెక్షన్లు పొడిచి 40 మందికి పైగా హెచ్​​ఐవీ సోకడానికి కారణమైన యూపీలోని ఉన్నవ్ జిల్లాకు చెందిన ఓ నకిలీ డాక్టరే ఇందుకు ఉదాహరణ.

వెనకబాటులో అగ్రస్థానమే..

ప్రపంచ జనాభా 770 కోట్లు. అందులో మన దేశానిది 17 శాతం. నవజాత శిశువుల మరణాల్లో 27 శాతం.. అయిదేళ్లలోపు పిల్లల చావుల్లో 21శాతం.. అంతర్జాతీయ వ్యాధుల భారంలో అయిదోవంతు.. మన దేశ ఖాతాలోనే ఉన్నాయి. అంతర్జాతీయంగా పౌరుల సొంత ఆరోగ్య వ్యయ సగటు 18 శాతం. అదే మన దేశంలో అనారోగ్యం పాలైనవారే వైద్య వ్యయంలో 63 శాతం దాకా భరించాల్సి వస్తోంది. సరే.. అప్పో సప్పో చేసి బయటపడదామనుకున్నా... అసలే అరకొర వైద్య సేవలు. సరైన చికిత్స అందక దేశంలో ఏటా లక్షలమంది మృత్యువాత పడుతున్నట్లు పార్లమెంటరీ స్థాయీ సంఘమే నిర్థారించింది.

కేంద్రమే ఒప్పుకుంది..

చైనాతోపాటు శ్రీలంక, నేపాల్‌, భూటాన్‌, బంగ్లాదేశ్‌ సైతం వైద్య సేవల్లో మనకంటే ముందున్నాయి. దేశం నలుమూలలా 30 శాతం మేర సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 20 శాతానికిపైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తగ్గినట్లు కేంద్రమే ఆ మధ్య లోక్‌సభలోనూ తెలిపింది. సిబ్బంది ఖాళీల భర్తీ పక్కనబెడితే... ఉన్న వారిలో అర్హులు అంతంత మాత్రమేనంటే.. ఇంకెన్నడు స్వస్థ భారత్ సాధ్యమయ్యేది? నాటు, నకిలీ వైద్యులు రెచ్చిపోవడానికి ఇంతకన్నా అనుకూల వాతావరణం ఇంకేం కావాలి?

అలా చేస్తేనే సాధ్యం!

వచ్చే పదేళ్లలో దేశీయ ఆస్పత్రుల్లో ఆరు లక్షల 40 వేల పడకలు అదనంగా కావాలన్నది ‘నీతి ఆయోగ్‌’ అంచనా. ‘ఆయుష్మాన్‌ భారత్‌’ సజావుగా అమలయ్యేందుకు చిన్న పట్టణాల్లో సుమారు రెండున్నరవేల ఆధునిక ఆస్పత్రులు నెలకొల్పాల్సి ఉందని ఏడెనిమిది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రతి వెయ్యిమంది జనాభాలో కనీసం ఒక వైద్యుడు ఉండాలన్నది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశం. కానీ... కనీసం ఏడున్నర లక్షల మందికి కొరత ఉన్నట్లు అంచనా. దేశంలో 20 లక్షలమంది వైద్యులు, 40 లక్షల మంది నర్సుల్ని అదనంగా నియమించాలని ఆరోగ్య భారత్‌ నివేదిక’ చెబుతోంది. పదేళ్ల కార్యాచరణ.. ప్రణాళిక, అమలయ్యేలా బడ్జెట్లలో కేటాయింపులు ఉంటే...ఆరోగ్య భారత్​ సాకారమవుతుందనేది నిజం..!

ఇంకెప్పుడు ఆరోగ్య భారత్​ సాకారమయ్యేది?

Patna (Bihar), June 03 (ANI): While addressing a press conference in Bihar's Patna, Rashtriya Lok Samta Party (RLSP) chief Upendra Kushwaha hit out on state's Chief Minister Nitish Kumar. He said, "I want to tell Bharatiya Janata Party (BJP), Nitish Kumar is known for disrespecting public's mandate. Deceiving public and alliance partners is his old habit. He warned BJP and said, "Party must be ready for 'dhoka no. 2.' It's been said about him 'aisa koi saga nahi jinko Nitish ji ne thaga nahi.'"
Last Updated : Jun 6, 2019, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.