ETV Bharat / state

దేవినేని దండయాత్రా?... వసంత విజయయాత్రా? - వసంత కృష్ణ ప్రసాద్

కృష్ణా జిల్లాలో కీలకమైన మైలవరం ఎవరి పరం కాబోతుంది..? మంత్రిగా ఉన్న దేవినేని ఉమాకు మైలవరం మరోసారి వరమిస్తుందా..? లేకా వైకాపా అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్​ను కరుణిస్తుందా..? టగ్ ఆఫ్ వార్​గా జరగబోతున్న మైలవరం సంగ్రామంలో ముందుకెళ్లేదెవరు..? పీఠాన్ని అధిష్టించేదెవరు..?

మైలవరం మైదానంలో విజేతలెవరు..?
author img

By

Published : Mar 27, 2019, 5:03 PM IST

మైలవరం మైదానంలో విజేతలెవరు..?
రాజకీయాల అడ్డా కృష్ణా జిల్లాలోని మైలవరం రాజకీయం.. మలుపులు తిరుగుతోంది. ఒకవైపు మంత్రిగా ఉన్న దేవినేని ఉమా... మరోపక్క మాజీ మంత్రి తనయుడు వసంత కృష్ణప్రసాద్​ బరిలోకి దిగటం ఆసక్తికరంగా మారింది. వీరిఎన్నికల ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తూ పావులు కదుపుతున్నారు. మైలవరాన్ని చేజిక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు చేస్తున్న వ్యూహాల నేపథ్యంలోఎవరికి విజయం దక్కనుందన్న విషయంపై..సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నువ్వా... నేనా?

మైలవరం... ప్రస్తుతం జిల్లాలో పొలిటికల్ హీట్​ను పెంచేస్తోన్న స్థానం. ఇద్దరు బలమైన అభ్యర్థులు బరిలో ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఒకరేమో మంత్రిగా ఉంటే... మరొకరేమో బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటంబం నుంచి వారసుడిగా అరగ్రేటం చేశారు. అంతే... మైలవరం మైదానంలో రాజకీయ పోరు నువ్వా-నేనా అన్నట్లు మారిపోయింది. ఇక్కడి నుంచి మరోసారి గెలిచి హ్యాట్రిక్​ కొట్టాలని ఉమా చూస్తుంటే..ఆయనకు చెక్ పెట్టేందుకు వసంతను బరిలోకి దింపింది ఫ్యాన్పార్టీ.

కాంగ్రెస్ గడ్డపై తెదేపా

మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు 13 సార్లు ఎన్నికలు జరిగితే... కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ) కలిపి 6 సార్లు గెలవగా, తెదేపా 5, సీపీఐ 2 సార్లు గెలిచాయి. మొదట కమ్యూనిస్టులఅడ్డాగా ఉన్న ఈ స్థానం...అనంతరం హస్తం ఖాతాలోకి వెళ్లిపోయింది. తెదేపా ఆవిర్భావం తర్వాత సైకిల్ పరుగు పెట్టడమే కాదు ఇప్పటివరకు 5సార్లు జెండా ఎగరేసింది. నందిగామ నుంచి పోటీలో ఉండే ఉమా...ఆ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావటంతో 2 సార్లు మైలవరం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

అభివృద్ధి పనులే గెలిపిస్తాయి: దేవినేని

మైలవరం నుంచి 2సార్లు గెలుపొందిన దేవినేని... భారీ స్థాయిలో అభివృద్ధి పనులు చేశారు. సీసీ రోడ్ల నిర్మాణం, పేదలకు ఇళ్ల పట్టాలు.. తాగు, సాగునీటి సమస్య పరిష్కరించేందుకు 22 లిఫ్టు ఇరిగేషన్లను ప్రారంభించారు. ప్రభుత్వ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో దేవినేని కీలక భూమిక వహించడం ఆయనకు కలిసొచ్చే అంశం. కిందటి ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి జోగి రమేశ్ పై 7569 ఓట్ల మెజార్టీతో దేవినేని గెలిచారు. ప్రస్తుతం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధే తెదేపాను మళ్లీ గెలిపిస్తుందని విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గం బాధ్యతలను కొంత మంది అనుచరులకే దేవినేని కేటాయించారని క్యాడర్​లో కొంత అసంతృప్తి ఉందన్న ప్రచారం కొనసాగుతుంది.

గెలుపే లక్ష్యంగా వసంత అడుగులు

వైకాపా అభ్యర్థిగా బరిలో ఉన్న వసంత కృష్ణ ప్రసాద్.. రాజకీయ నేపథ్యం ఉన్నకుటుంబం నుంచి వచ్చారు. మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు కుమారుడాయన. 1999లో నందిగామలో దేవినేని ఉమపైనే పోటీ చేసి కృష్ణప్రసాద్ ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన... మళ్లీ రంగంలోకి వచ్చారు. నియోజకవర్గంలో వైకాపా కేడర్ కొన్ని ప్రాంతాల్లో బలంగా ఉండటం కలిసొచ్చే అంశాలు. ఎన్నికలకు 10 నెలల మందు నుంచే నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీలు నిర్వహిస్తూ...గెలుపు వ్యూహాలు రచిస్తున్నారు.

పెరిగిన ఓట్లు.. గెలుపోటములపై ప్రభావం

జనసేన తరపున రామ్మోహన్ రావు, కాంగ్రెస్ అభ్యర్థిగా కిరణ్ ఎన్నికల బరిలో ఉన్నారు. జనసేన ప్రభావం ఏ పార్టీపై పడుతుందోనన్న ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే.. నియోజకవర్గంలో కొత్తగా ఈసారి 50 వేల ఓట్లు పెరిగాయి. తాజాగా పెరిగిన ఓట్లు...ఇబ్రహీంపట్నం, విజయవాడ శివార్లలోని గ్రామాల్లోనే అధికంగా ఉన్నాయి. మైలవరం గెలుపు ఓటములు నిర్ణయించటంలో ఈ ప్రాంతాలు కీలక పోషిస్తాయని ప్రధాన పార్టీల నేతలు లెక్కలు వేసుకుంటున్నారు.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.