ఇళ్ల నిర్మాణ పనులను 3 దశల్లో పూర్తి చేయనున్నారు. మొదటి దశలో 40, రెండో దశ కింద 36 ఇళ్లు సిద్ధం చేస్తారు. 400 చదరపు అడుగుల్లో నిర్మించనున్న ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 6 లక్షలు ఖర్చు చేయనున్నారు. ఈ ప్రయత్నం 116 కుటుంబాల్లో కొత్త వెలుగులు నింపనుంది.
7.77 కోట్ల రూపాయలతో చేపట్టే ఈ గృహాల నిర్మాణం... ఆరు నుంచి ఏడు నెలల్లో పూర్తి చేస్తామని ఈనాడు సీనియర్ అసోసియేట్ ఎడిటర్ డీఎన్ ప్రసాద్ వెల్లడించారు.భూమి పూజకు మార్గదర్శి గ్రూప్ ప్రెసిడెంట్ రాజాజీతోపాటు కుటుంబ శ్రీ మిషన్ ప్రతినిధులు హాజరయ్యారు.