బడ్జెట్ బాగుందని...అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఉందని రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అన్నారు. 'అధ్యక్షా నేను జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నా... మా అధినేత పవన్ కల్యాణ్ ఏం చేప్పారంటే..నువ్వు ఏదైనా సరే..అధికార పక్షం మాట్లాడిన తర్వాత వ్యతిరేకించొద్దని చెప్పారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు జరుగుతుంటే మద్దతివ్వాలని చెప్పారు. ఇటు అభివృద్ధిని, సంక్షేమాన్ని బడ్జెట్లో సమంగా చూశారు. బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేయటం అభినందనీయమన్నారు. రైతును చాలా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. వ్యవసాయం దండగా అనే పరిస్థితి నుంచి వ్యవసాయం పండగ అనే పరిస్థితికి తీసుకొచ్చింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. అదే బాటలో జగన్ నడుస్తున్నారు'. అని వరప్రసాద్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
తెదేపాను వైకాపా నేతలు, ప్రజలు వ్యతిరేకించారు కాబట్టే అక్కడున్నారని గుర్తు చేశారు. ఒకవేళ బడ్జెట్ను అమలు చేయకపోతే మీ స్థానంలోకి మేం వస్తామని చమత్కరించారు వరప్రసాద్.