ETV Bharat / state

జనసేన ప్లాఫ్ షో...2019..! - జనసేన ప్లాఫ్ షో-2019

పవర్‌ ఫుల్‌ ప్రసంగాలు ఓట్లు రాల్చలేకపోయాయి. వెల్లువలా వచ్చిన యువతరంగం... జన అంతరంగాన్ని పట్టలేకపోయింది. కొత్త తరహా రాజకీయంతో ప్రజలను మెప్పించలేక... సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. పవన్‌ క్రేజ్‌ ఏ మాత్రం అక్కరకు రాలేదు. ప్రశ్నించేందుకు గొంతుకులకు బలాన్నివ్వాలన్న అభ్యర్థనను జనం పట్టించుకోనట్టే కనిపిస్తోందీ ఫలితాలు చూస్తే. ఉవ్వెత్తున ఎగసిన జనసేన ఎందుకిలా అయిపోయింది? కీలక పాత్ర పోషిస్తామనే పార్టీ... చతికిల పడిపోవడానికి కారణమేంటి?

జనసేన ప్లాఫ్ షో...2019..!
author img

By

Published : May 24, 2019, 5:01 AM IST

ఆంధ్రా సమరంలో పోలింగ్ తర్వాత... తెదేపా, వైకాపా... సీట్ల లెక్కల్లో బిజీగా ఉంటే... జనసేన మాత్రం సైలెంట్ అయింది. ప్రచారానికి ముందు కింగ్ మేకర్లమవుతామనుకున్న ఆ పార్టీ.. ఎన్నికల తర్వాత మాటైనా లేకుండా ఎందుకలా ఉండిపోయింది? తెదేపా, వైకాపా ముందు ఎందుకు తేలిపోయింది. రెండు ప్రధాన పార్టీల గెలుపోటములపై ఆ పార్టీ ప్రభావమెంత?

ముఖ పరిచయం తక్కువే..
అభ్యర్థుల ఎంపికలో పవన్ లెక్క తప్పారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు పరిచయమే లేని అభ్యర్థులను బరిలో దింపడమే ఇందుకు కారణం. 2 ప్రధాన పార్టీల మధ్య జరిగిన పోరులో ఊసే లేకుండా పోయింది జనసేన. పవన్ కల్యాణ్​కున్న ఫాలోయింగ్... కలిసొస్తుందనుకున్నా లెక్క తప్పింది. క్షేత్రస్థాయి నేతలేవ్వరూ కనీసం జనానికి ముఖ పరిచయం లేకపోవడమూ ఇందుకు కారణమే. ఆ పార్టీ నుంచి బరిలో ఉన్నవారిలో ప్రజలకు తెలిసిన వారిని వెళ్లపై లెక్కపెట్టొచ్చు.

త్రిముఖం కాదు...ద్విముఖమే..
ఎన్నికల హడావుడి మెుదలైనప్పుడు పోరు త్రిముఖమే అనుకున్నారంతా... వాస్తవంలో వైకాపా, తెదేపా మధ్యే పోరు సాగింది. చర్చంతా రెండు పార్టీల చుట్టే.... తిరిగేసరికి... జనసేన ఊసే లేకుండా పోయింది. క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు లేకపోవడమూ... ఇందుకు కారణమే. యువతలోకి వెళ్లినంతా బలంగా... మిగతా వారిని ఆకట్టుకోవడంలో జనసైన్య విఫలమైంది. సభలకు వచ్చిన..వారిని ఓట్లుగా మలుచుకోవడంలో జనసేన విఫలమైంది.

అతడే ఒక సైన్యం
ప్రధాన పార్టీలతో పోల్చుకుంటే...జనసేన ప్రచారంలోనూ వెనకబడింది. పవన్ సభలు మినహా.. అభ్యర్థులెవ్వరూ బలంగా ప్రచారం చేయలేకపోయారు. పవన్ సమావేశాలు తప్ప ...పెద్దగా పార్టీ పేరు వినిపించలేదు. ఇప్పటికీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ముఖాలు సైతం తెలియని వారున్నారు. పవన్ ఉద్వేగభరిత మాటలు...హామీలు అభ్యర్థులు ప్రజల్లోకి సరిగా తీసుకుపోలేదనే విమర్శలున్నాయి. పవన్ మినహా చెప్పుకోదగిన నేతలు లేకపోవడం పార్టీని మరింత కిందకు నెట్టింది.

ప్రధాన పార్టీలపై ప్రభావం
సీట్లు గెలవడంలో విఫలమైన జనసేన... కొన్ని ముఖ్యమైన స్థానాల్లో గెలుపోటములను తారుమారు చేసింది. గోదావరి జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువ. తెదేపా గెలిచే స్థానాల్లో వైకాపా గెలిచేలా...వైకాపా గెలిచే కొన్ని స్థానాల్లో తెదేపా గెలిచేందుకు జనసేన ఓట్లు చీలికే కారణమైంది. 5 నుంచి 12 శాతం ఓట్లను కొల్లగొట్టింది.

ఇతర కారణాలు
జనసేన అంటే పవన్​ కల్యాణ్ మాత్రమేననే భావన ప్రజల్లో కలిగింది. మిగిలిన నేతలు సైతం...పవన్​ పైనే ఆశలు పెట్టుకోవడం, ప్రచారంలో సరిగా చేయకపోవడమే... ఆ పార్టీ సింగిల్​ డిజిట్​కే పరిమితమయ్యేలా చేసింది. మేనిఫెస్టో అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉన్నా... ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమయ్యారు జనసైనికులు. క్షేత్రస్థాయి కార్యకర్తలు పోల్​మేనేజ్​మెంట్​లోనూ వెనకబడే ఉన్నారు. ప్రత్యర్థులంతా...ధన బలం ఉన్నవారు కావడం... పార్టీ పెద్ద నష్టంగా మారింది. సామాజిక మాధ్యమాల్లో ఉన్నంత ప్రచారం...క్షేత్రస్థాయిలో లేకపోవడమూ మరో కారణం.

New Delhi, May 23 (ANI): After slaying with her performances in Bollywood films, Tisca Chopra is all set to make her web debut in a Hotstar special show 'Hostages' which will air on May 31. The 'Taare Zameen Par' actor shared the news on Instagram posting pictures with the fellow cast from the upcoming thriller series. "My web debut nad a series that will velcro you to your seats.. #HostagesOnHotstar .. on the 31st of May!! Mark your calendar for this one," Tisca captioned. The pictures shared by the actor features her with Ronit Roy, Dalip Tahil, Parvin Dabas and filmmaker Sudhir Mishra. The show follows the story of Dr. Mira Anand who is taken a hostage in her own home, pushing her into a dilemma of killing an innocent man to save her family. A few days back, the official handle of Hotstar specials also shared the poster of the show with a caption, "Will Dr. Mira Anand choose to kill an innocent man to save her family? Find out in Hostages, streaming 31st May!" Tisca Chopra was last seen in Deb Medhekar's 'Bioscopewala'. The film also starred Danny Denzongpa, Geetanjali Thapa and Adil Hussain. The film had its world premiere at the 30th Tokyo International Film Festival in October 2017.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.