ETV Bharat / state

నవరత్నాలను అమలు చేస్తాం: సీఎం జగన్‌ - AP CM

నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తానని సీఎం జగన్‌ అన్నారు. కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయాలు, పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సుపరిపాలన అందిస్తానని స్పష్టం చేశారు. రూ.2,250 నుంచి ఏడాదికేడాది పెంచుకుంటూ వెళ్తూ రూ.3 వేలు చేస్తానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి జగన్‌
author img

By

Published : May 30, 2019, 2:07 PM IST

ముఖ్యమంత్రి జగన్‌

జగన్‌ అనే నేను...
వైఎస్‌ జగన్‌ అనే నేను... అంటూ ప్రసంగం మొదలుపెట్టిన సీఎం జగన్‌... అందరి ఆశలు, ఆకాంక్షలు పూర్తిగా పరిగణలోకి తీసుకుంటానని పేర్కొన్నారు. పదేళ్లుగా తన రాజకీయ జీవితంలో 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశానన్న జగన్‌... పేదల కష్టాలు చూసి, విన్నాక ఒక్క మాట ఇస్తున్నాని... తాను ఉన్నానని గట్టిగా చెబుతున్నానంటూ హామీ ఇచ్చారు. మేనిఫెస్టో అంటే రెండే రెండు పేజీలతో ప్రజలకు గుర్తుండేలా చేశానన్న సీఎం... మేనిఫెస్టో అంటే ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలని అన్నారు. గత ప్రభుత్వం, పాలకుల మాదిరిగా మేనిఫెస్టో పుస్తకాలు తీసుకురాలేదని ఎద్దేవా చేశారు.

మేనిఫెస్టోను భగవద్గీతగా భావిస్తా...
ఎన్నికల ప్రణాళిక అంటే ఈ ఐదేళ్లలో ఏం చేస్తారనేది ప్రజలు గుర్తుంచుకోవాలన్న ముఖ్యమంత్రి జగన్‌... మేనిఫెస్టోను ఖురాన్‌, బైబిల్‌, భగవద్గీతగా భావిస్తానని చెప్పారు. మేనిఫెస్టోను ఊపిరిగా భావిస్తానని అన్నారు. అవ్వ, తాతల ఆశీస్సుల కోసం పింఛను రూ.3 వేలకు పెంచుకుంటూ వెళ్తానన్న జగన్‌... వైఎస్‌ఆర్‌ పింఛన్‌ను రూ.2,250కు పెంచుతూ తొలి సంతకం చేస్తున్నానని తెలిపారు. ప్రతి ఏడాది పెంచుకుంటూ వెళ్తూ రూ.3 వేలు చేస్తానని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి జగన్‌

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు...
నవరత్నాల్లోని ప్రతి అంశం అందరికీ అందేలా కృషి చేస్తానన్న సీఎం జగన్‌... ఆగస్టు 15 నాటికి గ్రామ వాలంటీర్లుగా 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకొచ్చారు. ప్రతి గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించనున్నట్లు పేర్కొన్నారు. రూ.5 వేలు జీతంతో గ్రామ వాలంటీర్లు పని చేస్తారన్న సీఎం జగన్‌... లంచాలు లేకుండా చేయాలనే గ్రామ వాలంటీర్లను నియమిస్తున్నట్లు స్పష్టం చేశారు.

అవినీతి రహిత పాలన అందిస్తా..
ఏ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందకపోయినా నేరుగా సీఎం కాల్‌సెంటర్‌కు ఫోన్​ చేయవచ్చన్న జగన్‌... సీఎం కార్యాలయ ఫోన్‌ నెంబర్‌ అందుబాటులో ఉంచుతామని చెప్పారు. గ్రామ సచివాలయం ద్వారా 10 మంది గ్రామస్థుల చొప్పున లక్షా 60 వేల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. గాంధీ జయంతి అక్టోబర్‌ 2 నాటికి మరో లక్షా 60 వేల ఉద్యోగ నియామకాలు చేపడతామని హామీఇచ్చారు. ఎలాంటి లంచాలు లేకుండా 72 గంటల్లోనే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

తక్కువ ధరకే విద్యుత్...
పవన విద్యుత్‌ను యూనిట్‌కు రూ.4.84కు కొనుగోలు చేస్తున్నారన్న సీఎం జగన్‌... పీక్‌ అవర్స్‌ పేరుతో యూనిట్‌కు రూ.6కు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్‌ను తక్కువ ధరకు తీసుకొచ్చేలా కృషిచేస్తానని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. హైకోర్టు జడ్జితో జ్యుడీషియల్‌ కమిషన్‌ వేయాలని హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ను కోరతానన్న సీఎం... ప్రతి కాంట్రాక్ట్‌ టెండర్లకు పోకముందే కమిషన్‌ ముందుకు పంపుతామని స్పష్టం చేశారు.

హామీలన్నీ అమలు చేస్తా...
నవరత్నాల్లోని ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తామన్న సీఎం జగన్‌... పైస్థాయి నుంచి కిందిస్థాయి వరకు పూర్తిగా ప్రక్షాళన చేస్తామని చెప్పారు. ఏయే పనుల్లో అవినీతి జరిగిందో ఆ కాంట్రాక్ట్‌లన్నీ రద్దు చేస్తామన్నారు. ఎక్కువమంది టెండర్లలో పాలు పంచుకునేలా అవకాశం కల్పిస్తామన్న జగన్‌... రివర్స్‌ టెండరింగ్‌ పాలసీ తీసుకొస్తామని చెప్పారు.

ఆకాశమంతటి విజయాన్ని అందించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన జగన్‌... తమిళనాడులో స్టాలిన్‌ కూడా సీఎంగా ప్రమాణం చేయాలని కోరుకుంటున్నాని పేర్కొన్నారు.

Intro:Ap_Vsp_37_30_YSRCP_Sambharaalu_Ab_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్ బైట్: వైఎస్.జగన్ సీఎం గా ప్రమాణం చేయడంతో వైస్సారసిపి కార్యకర్తల ఆనందానికి ఆవధుల్లేకుండా పోయాయి. చోడవరంలో ఆ పార్టీ నాయకులు ముందుగా వైఎస్ విగ్రహాన్ని కి పూలమాల వేశారు. బాణాసంచా కాల్చారు. ప్రజలకు చక్కర పొంగళి, పులిహోరా అందించారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.